
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo Y02T స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. లీక్స్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. లేటెస్ట్ లీక్ లో, Vivo Y02T ధర, స్పెసిఫికేషన్స్, ఫోటోస్ రివీల్ అయ్యాయి. భారత్ లో ఈ ఫోన్ 4జిబి+64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,490 గా ఉంటుందని సమాచారం. సరే, ఓసారి Vivo Y02T ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Vivo Y02T ధర
- 4జిబి+64జిబి= రూ.9,490
Vivo Y02T డివైజ్ కి సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేశారు. భారత్ లో ఈ వివో ఫోన్ రూ.9,490 ధరతో లాంచ్ కానుందని తెలుస్తోంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. రానున్న కొన్ని రోజుల్లో భారత్ లో Vivo Y02T డివైజ్ సేల్ మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Vivo Y02T స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- హెచ్డీ+ డిస్ప్లే
- 6.51-ఇంచ్ స్క్రీన్
లీక్స్ ని బట్టి, Vivo Y02T స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంటాయి.
చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ
- హీలియో పీ35
- 4జిబి ర్యామ్
- 64జిబి స్టోరేజీ
Vivo Y02T స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ 4జిబి వర్చువల్ ర్యామ్, 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది.
కెమెరా విభాగం
- 8ఎంపి రియర్ కెమెరా
- 5ఎంపి ఫ్రంట్ కెమెరా
Vivo Y02T స్మార్ట్ ఫోన్ లో సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, ఓఎస్
- 5000ఎంఏహెచ్
- 10 వాట్ చార్జింగ్
Vivo Y02T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.
వేరియంట్స్
ఎన్ని మెమొరీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందోనన్న సమాచారం ఇంకా బయటకు రాలేదు. అయితే లీక్ ని బట్టి, ఈ ఫోన్ కాస్మిక్ గ్రే మరియు సన్‌సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో రానుందని తెలుస్తోంది.











