అక్టోబర్ 27న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo Y100 5G; టీజర్ విడుదల చేసిన కంపెనీ!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y100 5G
  • టీజర్ విడుదల చేసిన వివో కంపెనీ
  • డ్యూయల్ టెక్షర్ కలర్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y100 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన టీజర్ ఇమేజ్ ని వివో సంస్థ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దాని ప్రకారం, Vivo Y100 5G ఫోన్ అక్టోబర్ 27 న లాంచ్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Vivo Y100 5G డివైజ్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్, డిజైన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y100 5G లాంచ్ తేదీ

  • టీజర్ ఇమేజ్ లో వివో సంస్థ Vivo Y100 5G డివైజ్ ని అక్టోబర్ 27 న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
  • సమయం విషయానికి వస్తే, చైనాలో మధ్యాహ్నం 2.30 గంటలకు డివైజ్ ప్రజెంటేషన్ ఉంటుంది.
  • భారత్ లో Vivo Y100 పేరుతో ఓ ఫోన్ 2023 ఫిబ్రవరి లో లాంచ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ వేరే స్పెసిఫికేషన్స్ తో చైనాలో విడుదలవుతోంది.

Vivo Y100 5G డిజైన్

  • టీజర్ ఇమేజ్ ప్రకారం, Vivo Y100 5G ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుందని అర్థమవుతోంది. అవి: గ్రీన్, బ్లూ.
  • ఫోన్ డ్యూయల్ టెక్షర్ కలర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Vivo Y100 5G బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో Vivo బ్రాండింగ్ ఉంది.
  • Vivo Y100 5G ఫోన్ ముందు వైపు చూస్తే, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉన్నాయి.

Vivo Y100 5G స్పెసిఫికేషన్స్ (భారత్)

  • డిస్ప్లే: Vivo Y100 5G లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, వాటర్-డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y100 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Vivo Y100 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
  • కెమెరా: Vivo Y100 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y100 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo Y100 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous article50MP కెమెరా, 8GB ర్యామ్‌తో లాంచైన Vivo Y55t 5G
Next articleనవంబర్ 2 న లాంచ్ అవుతోన్న Lava Blaze 2 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.