50MP కెమెరా, 8GB ర్యామ్‌తో లాంచైన Vivo Y55t 5G

Highlights

  • చైనాలో లాంచైన Vivo Y55t 5G
  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • Vivo Y55t 5G ధర రూ.11,500

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ని విస్తరిస్తూ పోతోంది. ఇప్పటికే వై-సిరీస్ లో చాలా ఫోన్లు అందుబాటులో ఉండగా, తాజాగా Vivo Y55t 5G డివైజ్ చైనాలో లాంచ్ అయ్యింది. త్వరలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇండియా లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన రానున్న రోజుల్లో వెల్లడి కావచ్చు. ఇకపోతే Vivo Y55t 5G డివైజ్ 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y55t 5G ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y55t 5G ధర

  • చైనాలో Vivo Y55t 5G డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • అవి: 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్. వీటి ధరలను చూస్తే, 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.999 యువాన్లు (సుమారు రూ.11,500) గా ఉంది.
  • మరోవైపు 256జిబి మోడల్ ధర 1199 యువాన్లు (సుమారు రూ.13,900) గా ఉంది.
  • Vivo Y55t 5G డివైజ్ చైనాలో బ్లాక్, పర్పుల్, గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y55t 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y55t 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2388*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 550 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y55t 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్. 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.
  • మెమొరీ: Vivo Y55t 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, ఎల్పీడీడీఆర్4ఎక్స్ డ్యూయల్ చానల్ ర్యామ్ టెక్నాలజీ, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్2.2 మెమొరీ టెక్నాలజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Vivo Y55t 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Vivo Y55t 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo Y55t 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y55t 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.