
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo Y100i 5G పేరుతో ఈ డివైజ్ చైనీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Vivo Y100i 5G డివైజ్ తక్కువ ధరలో 512జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తున్న డివైజ్ అని చెప్పవచ్చు. ఇంకా ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y100i 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y100i 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y100i 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ (2388*1080 పిక్సెల్స్) స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y100i 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
- మెమొరీ: Vivo Y100i 5G లో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి.
- బ్యాటరీ: Vivo Y100i 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo Y100i 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: Vivo Y100i 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి ఏఐ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఇతర ఫీచర్లు: Vivo Y100i 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. ఈ డివైజ్ 7.98 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
Vivo Y100i 5G ధర, లభ్యత
Vivo Y100i 5G డివైజ్ బ్లూ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ ధరను చైనాలో 1599 యువాన్లు (సుమారు రూ.18,360) గా నిర్ణయించారు. నవంబర్ 28 నుంచి ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.












