OPPO: లీకైన OPPO F25 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO F25
  • మార్చి 5 న లాంచ్ అయ్యే అవకాశం
  • F23 కి సక్సెసర్ గా వస్తోన్న OPPO F25

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO F25 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజా అప్డేట్ ద్వారా OPPO F25 లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా తెలిసాయి. భారత్ లో ఒప్పో ఎఫ్-సిరీస్ కి ప్రజాదరణ బాగానే ఉంది. దీంతో యూజర్లు ఈ ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సరే, ఓసారి OPPO F25 యొక్క లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO F25 లాంచ్ తేదీ (లీక్)

  • OPPO F25 డివైజ్ లాంచ్ తేదీ లీకైంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై ఈ వివరాలను షేర్ చేశారు.
  • టిప్‌స్టర్ పోస్ట్ ప్రకారం, 2024 మార్చి 5 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
  • రానున్న రోజుల్లో ఒప్పో సంస్థ నుంచి OPPO F25 యొక్క లాంచ్ తేదీ అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

OPPO Reno 11F కి రీబ్రాండ్‌గా వస్తోన్న OPPO F25?

  • OPPO F25 స్మార్ట్‌ఫోన్ Reno 11F కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని తెలుస్తోంది. ఈ రెనో 11ఎఫ్ ఇటీవలె థాయిలాండ్ మార్కెట్ లో లాంచైంది.
  • అయితే, కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

OPPO F25 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO F25 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO F25 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO F25 5G లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. 6జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది.
  • రియర్ కెమెరా: OPPO F25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒమ్నివిజన్64బి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: OPPO F25 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐంఎంఎక్స్615 కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO F25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO F25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO F25 5G లో ఐపీ65 రేటింగ్, డ్యూయల్ సిమ్ 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
Previous articleVivo: 120W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Vivo Y100t 5G
Next articleTecno: ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్‌పై లిస్టైన Tecno Pova 6
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.