
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కానున్నాయి. Vivo Y18i, Y18t పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్‌పై Vivo Y18i, Y18t డివైజెస్ లిస్ట్ అయ్యాయి. దీంతో డివైజెస్ కి సంబంధించిన రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Vivo Y18i, Y18t బీఐఎస్ వివరాలు
Vivo Y18i స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై V2414 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. Vivo Y18t స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ పై V2408 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇదే మోడల్ నంబర్ తో ఈ ఫోన్ ఇటీవలె టీయూవీ వెబ్‌సైట్ మరియు ఐఎంఈఐ డేటాబేస్ లపై కనిపించింది.
Vivo Y18i స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్‌పై V2414 అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 419 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1461 పాయింట్లు నమోదు చేసింది. ఈ లిస్టింగ్ పై యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్, 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.
Vivo Y18 స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Vivo Y18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 83 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ గేముత్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo Y18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి జీ52 జీపీయూ ఉన్నాయి.
కెమెరా: Vivo Y18 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, వీజీఏ (0.8ఎంపి) సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
ర్యామ్, స్టోరేజీ: Vivo Y18 డివైజ్ లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
సాఫ్ట్‌వేర్: Vivo Y18 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ, చార్జింగ్: Vivo Y18 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
భద్రత: Vivo Y18 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
కనెక్టివిటీ: Vivo Y18 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: Vivo Y18 డివైజ్ 163.63 మి.మీ పొడవు, 75.58 మి.మీ వెడల్పు, 8.39 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.











