
OPPO A78 4G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ కంటే ముందు OPPO A78 5G డివైజ్ ని కూడా కంపెనీ లాంచ్ చేసింది. 5జీ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. అమెజాన్ మరియు ఒప్పో ఈస్టోర్ లో ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. సరే, ఓసారి OPPO A78 4G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
OPPO A78 4G ధర, లభ్యత
OPPO A78 4G స్మార్ట్ ఫోన్ సీ గ్రీన్, బ్లాక్ మిస్ట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్ ధరను IDR 3,599,000 (సుమారు రూ.19,600) గా ఉంది. ఇది సింగిల్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ధర. ఇండోనేషియన్ కస్టమర్లకు ఒప్పో సంస్థ OPPO A78 4G కొనుగోలుపై Enco Buds 2 ఇయర్ బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది. ఇండోనేషియాలో 4జీ వేరియంట్ ధర, ఇండియా 5జీ వేరియంట్ ధర కంటే ఎక్కువగా ఉంది.
OPPO A78 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- డిస్ప్లే: OPPO A78 4G లో 6.43-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- రియర్ కెమెరా: OPPO A78 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ లెన్స్ ఉన్నాయి.
- ఫ్రంట్ కెమెరా: OPPO A78 4G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు.
- సాఫ్ట్‌వేర్: OPPO A78 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: OPPO A78 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- డైమెన్షన్స్: OPPO A78 4G డివైజ్ 160.01 మి.మీ పొడవు, 73.23 మి.మీ వెడల్పు, 7.93 మి.మీ మందం (ఫాగ్ బ్లాక్), 160.01 మి.మీ పొడవు, 73.23 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం (సీ గ్రీన్), 180 గ్రాముల బరువు ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: OPPO A78 4G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, స్టీరియో స్పీకర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0 ఉన్నాయి.











