Google Play Console పై లిస్టైన Vivo Y79+ 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y79+
  • వివో వై100 కి రీబ్రాండ్ అని టాక్
  • కొన్ని వారాల క్రితం చైనాలో లాంచైన వివో వై100

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో ఇప్పటి వరకు చాలా ఫోన్లను లాంచ్ చేసింది. ఇంకా ఆ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా మరొక కొత్త వై-సిరీస్ ఫోన్ Vivo Y79+ 5G గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై ప్రత్యక్షమైంది. PD2313 అనే మోడల్ నంబర్ తో ఈ డివైజ్ లిస్టైంది. వివో రీసెంట్ గా చైనా మార్కెట్ లో Vivo Y100 ని లాంచ్ చేసింది. Vivo Y79+ 5G డివైజ్ Vivo Y100 కి రీబ్రాండ్ వర్షన్ అని టాక్ వినిపిస్తోంది.

Vivo Y79+ 5G గూగుల్ ప్లే లిస్టింగ్ వివరాలు

  • Vivo Y79+ 5G డివైజ్ గూగుల్ ప్లే లిస్టింగ్ పై V2313 అనే మోడల్ నంబర్ తో లిస్టైంది. Vivo Y100 5G చైనీస్ వేరియంట్ కూడా ఇదే మోడల్ నంబర్ కలిగి ఉంది. దీంతో Vivo Y79+ 5G డివైజ్ Vivo Y100 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని అంచనా వేస్తున్నారు.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Vivo Y79+ 5G డివైజ్ 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్ స్క్రీన్, 480పీపీఐ పిక్సెల్ డెన్సిటీ తో లిస్టైంది.
  • Vivo Y79+ 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎస్ఎమ్6375 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Vivo Y79+ 5G లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వినియోగించినట్లు లిస్ట్ లో ఉంది.
  • Vivo Y79+ 5G లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. Vivo Y100 5G చైనీస్ వేరియంట్ లో కూడా ఇదే చిప్సెట్ వాడారు.
  • Vivo Y79+ 5G 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా పైన తెలిపిన విషయాలు తప్పితే, మరే ఇతర స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు.
Previous article50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Redmi 13C
Next articleలాంచ్‌కి ముందు లీకైన Realme GT Neo 6 ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.