Home News ఇన్వైట్ కోడ్ లేకుండానే నథింగ్ ఫోన్ (1) ని కొనవచ్చు, ఎలాగో ఇక్కడ తెలుసుకోండి

ఇన్వైట్ కోడ్ లేకుండానే నథింగ్ ఫోన్ (1) ని కొనవచ్చు, ఎలాగో ఇక్కడ తెలుసుకోండి

హైలైట్స్:

* Nothing Phone (1) ప్రీ-ఆర్డర్ పాస్ ని రూ.2000 కి ఫ్లిప్ కార్ట్ నందు కొనుగోలు చేయవచ్చు.

* అయితే వినియోగదారులు ఎటువంటి ఇన్వైట్ కోడ్ లేకుండానే పాస్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

* జులై 12 న నథింగ్ ఫోన్ (1) లాంచ్ అవుతోంది.

జులై 12 న భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. తొలుత డిజైన్ ని టీజ్ చేసిన కంపెనీ తర్వాత యూట్యూబ్ వీడియో లో పూర్తి స్థాయిలో విడుదల చేసింది. గ్లైప్ ఎల్ఈడీ లైట్ ఇంటర్ ఫేస్, ట్రాన్స్పరంట్ బ్యాక్ ప్యానెల్, పంచ్-హోల్ కటౌట్ తో వస్తున్న ఈ ఫోన్ నథింగ్ బ్రాండ్ నుంచి వస్తున్న తొలి ఫోన్. ఇన్వైట్ కోడ్ ద్వారా ప్రీ-ఆర్డర్ పాస్ లు పొందిన వారు మాత్రమే ఫోన్ ని కొనుగోలు చేయగలరని తొలుత కంపెనీ వెల్లడించింది. కానీ, తర్వాత ప్రణాళికలు మారుతున్నాయి.

ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ పాస్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఎటువంటి ఇన్వైట్ కోడ్ లేకుండానే, వినియోగదారులు ఈ ప్రీ-ఆర్డర్ పాస్ ని కొనుగోలు చేసి, ఫోన్ ని రిజర్వ్ చేసుకోవచ్చు. దీన్నిబట్టి, వినియోగదారులు ఇతరులకు రిఫర్ చేస్తూ, ఇన్వైట్ కోడ్ కోసం వేచి చూడనవసరం లేదని అర్థమవుతోంది.

నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ పాస్

నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ పాస్ ని ఫ్లిప్ కార్ట్ లో రూ.2000 చెల్లించి నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం ఎటువంటి ఇన్వైట్ కోడ్ అక్కర్లేదు. పాస్ ని కొన్న వినియోగదారులు జులై 12 రాత్రి 9 గంటల నుంచి జులై 18 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నథింగ్ ఫోన్ (1) ని కొనుగోలు చేసే అవకాశముంటుంది. ధర, స్పెసిఫికేషన్స్ ని ప్రకటించిన తర్వాత, ఏ కొనుగోలుదారుడైన ఫోన్ ని కొనవద్దని నిర్ణయించుకుంటే, వారికి రూ.2000 రిఫండ్ చేయబడతాయి.

నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్

ముకుల్ శర్మ పోస్ట్ ద్వారా నథింగ్ ఫోన్ (1) లైవ్ ఇమేజ్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. ఆ పిక్ ని బట్టి, ఈ ఫోన్ 120Hz అమోలెడ్ డిస్ప్లే తో వస్తుందని తెలుస్తోంది. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను సెట్టింగ్స్ లో మార్చుకునే వీలు కూడా ఉంది.

నథింగ్ ఫోన్ (1) 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 778+ 5జీ చిప్సెట్, 12జిబి ఎల్పీడీడీఆర్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, నథింగ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

4,500 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోన్న నథింగ్ ఫోన్ (1) 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. 5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్లో ఉంటాయని సమాచారం. ఇక కనెక్టివిటీ ఆప్షన్లు చూస్తే, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లున్నాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే, నథింగ్ ఫోన్ (1) లో డ్యూయల్ కెమెరాలున్నాయి. 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 16ఎంపి సెకండరీ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు 16ఎంపి కెమెరా ఉంది.