హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్
- 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ కెమెరా సెన్సర్ తో రానున్న Xiaomi 13 Pro
- Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసిన టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi త్వరలో Xiaomi 13 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ కోసం షావోమీ లవర్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. Xiaomi 13 సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో లాంచ్ అవుతుందని రూమర్ల ద్వారా తెలుస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ లైనప్ లో మొత్తం మూడు ఫోన్లు ఉండనున్నాయి. అవి: Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13X. ఈ మూడు ఫోన్లు కూడా ఈ ఏడాది చైనాలో లాంచ్ అవ్వనున్నాయని అంచనా వేస్తున్నారు.
లాంచ్ కి ముందు Xiaomi 13 Pro యొక్క ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ Xiaomi 13 Pro యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని లీక్ చేశాడు. అతడు లీక్ చేసిన సమాచారాన్ని బట్టి, Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి కెమెరా విభాగంలో భారీ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓసారి Xiaomi 13 Pro యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.
Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్
Xiaomi 13 Pro భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. లాంచ్ కి ముందు ప్రముక టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాడు. Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, ఎల్టీపీవో స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రెజుల్యూషన్ తో వస్తోంది.
Xiaomi 13 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. ఇదే చిప్సెట్ ని ఐకూ 11 సిరీస్, వన్ ప్లస్ 11 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ లో వాడుతున్నారు. Xiaomi 13 Pro 8జిబి/12జిబి ర్యామ్ వర్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. దీనిలో 128జిబి/256జిబి మరియు 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండనున్నాయి. ఈ ఫోన్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi 13 Pro కంపెనీ యొక్క Surge C2, P2 చిప్స్ తో వస్తోంది. ఇప్పటి వరకు వీటి గురించి వివరాలు తెలియదు.
Xiaomi 13 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 13 Pro లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. అలాగే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్ ఉండటం విశేషం. ఇంతకు ముందు ఈ సెన్సర్ ని షావోమీ 12ఎస్ అల్ట్రా లో వాడారు. అలాగే 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. Xiaomi 13 సిరీస్ కెమెరా సిస్టమ్ రూపకల్పనలో షావోమీ, లైకా కంపెనీతో కలిసి పని చేసింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












