
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఈ ఏడాది మార్చిలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 14 ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పై ఏకంగా రూ.22,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.
Xiaomi 14 ధర మరియు ఆఫర్లు
Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ పై రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు, రూ.7,000 కూపన్ డిస్కౌంట్, రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇవన్నీ కలిపితే, మొత్తం రూ.22,000 డిస్కౌంట్ లభించనుంది.
ఆఫర్ తో Xiaomi 14 12జిబి+512జిబి వేరియంట్‌ని రూ.47,999 కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.69,999 గా ఉంది.
బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు కాకుండా, నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. 3 నుంచి 6 నెలల కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
మీరు గనుక మీ పాత ఫోన్ అమ్మాలనుకుంటే, కంపెనీ ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.35,000 వరకు అందిస్తోంది. అయితే పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
Xiaomi 14 ని ఎక్కడ కొనాలి?
ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో పైన పేర్కొన్న అన్ని ఆఫర్లు లభిస్తాయి. లింక్ ను క్రింద ఇవ్వడం జరిగింది. ఇక, Xiaomi 14 డివైజ్ కంపెనీ వెబ్‌సైట్ పై రూ.59,999 ధరతో లిస్ట్ అయ్యింది. ఆఫర్లతో ఈ ఫోన్‌ని కొనాలనుకుంటే అమెజాన్ వెబ్‌సైట్ విజిట్ చేయండి.
Xiaomi 14 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ డిస్ప్లే, 2670*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.












