Home News లీకైన Xiaomi 14 Ultra కెమెరా స్పెసిఫికేషన్స్

లీకైన Xiaomi 14 Ultra కెమెరా స్పెసిఫికేషన్స్

Highlights
  • క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తోన్న Xiaomi 14 Ultra
  • 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న Xiaomi 14 Ultra

Xiaomi సంస్థ కొన్ని రోజుల క్రితం Xiaomi 14, Xiaomi 14 Pro ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు Xiaomi 14 Ultra ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. తాజాగా Xiaomi 14 Ultra కి సంబంధించిన కెమెరా వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (లీక్)

చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Xiaomi 14 Ultra యొక్క కెమెరా వివరాలను షేర్ చేసింది. ఆ పోస్ట్ ప్రకారం, Xiaomi 14 Ultra డివైజ్ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో ఉండే 4 కెమెరాలు కూడా 50ఎంపి సెన్సర్స్ కావడం విశేషం.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)