50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14T, Xiaomi 14T Pro, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

Highlights

  • గ్లోబల్‌గా Xiaomi 14T సిరీస్ లాంచ్
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • డైమెన్సిటీ చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi గ్లోబల్ గా 14T సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Xiaomi 14T మరియు Xiaomi 14T Pro అనే రెండు మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, లైకా లెన్స్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ రెండు ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ధరలు

Xiaomi 14T ధర 649 యూరోలు (సుమారు రూ.60,500) గా ఉంది. Xiaomi 14T Pro ధర 799 యూరోలు (సుమారు రూ.74,500) గా ఉంది. ఇవి 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు.

Xiaomi 14T టైటాన్ బ్లూ, టైటాన్ గ్రే, టైటాన్ బ్లాక్ మరియు లెమన్ గ్రాస్ కలర్స్ లో లాంచ్ అయ్యింది. Xiaomi 14T Pro డివైజ్ టైటాన్ బ్లూ, టైటాన్ గ్రే మరియు టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Xiaomi 14T, Xiaomi 14T Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే: Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లలో 6.67-ఇంచ్ 144 హెర్ట్జ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

చిప్సెట్: Xiaomi 14T లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్ అందించారు. ప్రో వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ అందించారు. ఇదే ప్రాసెసర్ ను మనం ఐకూ జెడ్9 టర్బో+ లో కూడా చూడవచ్చు.

14T కెమెరా: Xiaomi 14T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

14T Pro కెమెరా: Xiaomi 14T Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ లైట్ ఫ్యూజన్ 900 మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లలో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

సాఫ్ట్‌వేర్: ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యాయి.

బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ప్రో వేరియంట్ 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, స్టాండర్డ్ మోడల్ 67 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. రెండు ఫోన్లలో 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్ అందించారు.

ఇతర ఫీచర్లు: Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, సర్కిల్ టు సెర్చ్, జెమిని ఏఐ, మరియు ఇతర అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి.