
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎన్నో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో వచ్చింది. గెలాక్సీ ఏఐ ఫీచర్లతో పాటు, ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, డైనమిక్ అమోలెడ్ ప్యానెల్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మార్కెట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 FE ధర
Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం యూఎస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 649 డాలర్లు (సుమారు రూ.54,300) గా ఉంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 709 డాలర్లు (సుమారు రూ.59,300) గా పెట్టారు. 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వేరియంట్ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఇంకా దీని ధరను వెల్లడించలేదు.
Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రాఫైట్, గ్రే, మింట్ మరియు యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy S24 FE లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S24 FE డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
ప్రాసెసర్: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో ఎగ్జినోస్ 2400ఈ చిప్సెట్ వాడారు.
బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S24 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: Samsung Galaxy S24 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి 3ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 7 ఏళ్ళ వరకు ఈ ఫోన్‌కి మేజర్ ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
కనెక్టివిటీ: Samsung Galaxy S24 FE లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.












