Infinix: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Smart 8

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Infinix Smart 8 8జిబి ర్యామ్ వేరియంట్
  • Infinix Smart 8 ధర రూ.8,999
  • ఇప్పటికే అందుబాటులో ఉన్న 4జిబి ర్యామ్ వేరియంట్

Infinix సంస్థ భారత్ లో తన పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటూ పోతోంది. నేడు భారత్ లో ఈ సంస్థ Infinix Smart 8 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ,8,999 గా నిర్ణయించింది. Infinix Smart 8 డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 ధర

  • Infinix Smart 8 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ భారత్ లో రూ.8,999 ధరతో లాంచ్ అయ్యింది.
  • Infinix Smart 8 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.7,099 ధరతో సేల్ కి అందుబాటులో ఉంది.
  • Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్ టింబర్ బ్లాక్, షైనీ గోల్డ్, రెయిన్‌బో బ్లూ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Smart 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Smart 8 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ఓఎస్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
  • కెమెరా: Infinix Smart 8 లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • కనెక్టివిటీ: Infinix Smart 8 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
Previous articleSamsung: ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై లిస్టైన Samsung Galaxy A55 5G
Next articleOPPO: గీక్‌బెంచ్‌పై లిస్టైన Reno 11F 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.