4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన TECNO Spark Go 2024

Highlights

  • నేడు భారత్‌‌లో లాంచైన TECNO Spark Go 2024
  • TECNO Spark Go 2024 ధర రూ.7,299 మాత్రమే
  • డైనమిక్ పోర్ట్ ఫీచర్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ TECNO గతేడాది డిసెంబర్ లో TECNO Spark Go 2024 ని లాంచ్ చేసింది. అప్పుడు 3జిబి + 64జిబి మరియు 4జిబి + 64జిబి స్టోరేజీ వేరియంట్స్ ని పరిచయం చేసింది. ఇప్పుడు టెక్నో కంపెనీ, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఓసారి ఈ ఫోన్ ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

TECNO Spark Go 2024 ధర, ఆఫర్లు మరియు లభ్యత

  • TECNO Spark Go 2024 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను భారత్ లో రూ.7,299 గా నిర్ణయించారు.
  • TECNO Spark Go 2024 డివైజ్ ని అమెజాన్ ద్వారా నేటి నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • TECNO Spark Go 2024 128జిబి మోడల్ పై రూ.500 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తుంది. దీంతో ఫోన్ రూ.6,799 కే లభిస్తుంది.
  • TECNO Spark Go 2024 ఫోన్ మిస్టిక్ వైట్ మరియు గ్రావిటీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

TECNO Spark Go 2024 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: TECNO Spark Go 2024 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: TECNO Spark Go 2024 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: TECNO Spark Go 2024 లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: TECNO Spark Go 2024 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • బ్యాటరీ: TECNO Spark Go 2024 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: TECNO Spark Go 2024 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: TECNO Spark Go 2024 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.