Tecno: ఫిబ్రవరి 27న భారత్‌లో లాంచ్ అవుతోన్న Spark 20C

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20C
  • ఇప్పటికే భారత్ లో లాంచైన Tecno Spark 20
  • 8జిబి ర్యామ్ తో వస్తోన్న Tecno Spark 20C

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno ఇటీవలె భారత్ లో Spark 20 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.10,499 కి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు Tecno Spark 20C డివైజ్ ని టెక్నో కంపెనీ భారత్ కి తీసుకొస్తోంది. భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ ఫిబ్రవరి 27న లాంచ్ అవుతోంది. లాంచ్ తేదీతో పాటు, ఈ ఫోన్ కి సంబంధించిన మరెన్నో వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20C ఇండియా లాంచ్ వివరాలు

  • Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ ని భారత్ లో ఫిబ్రవరి 27న లాంచ్ చేయనున్నట్లు టెక్నో సంస్థ వెల్లడించింది.
  • ప్రస్తుతం అమెజాన్ పై Tecno Spark 20C ల్యాండింగ్ పేజీ కనిపిస్తోంది.
  • అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 27 నుంచి Tecno Spark 20C సేల్ మొదలుకానుంది.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20C లో 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Tecno Spark 20C లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీన్ని కంపెనీ 50ఎంపి అల్ట్రా క్లియర్ కెమెరా అని కంపెనీ పిలుస్తోంది. ఈ కెమెరా సెటప్ టైమ్ ల్యాప్స్ ఫీచర్ తో వస్తోంది.
  • స్క్రీన్: Tecno Spark 20C డివైజ్ పంచ్ హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉంటాయి.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Tecno Spark 20C లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20C లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ చిప్సెట్.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20C డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Tecno Spark 20C లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
Previous articleiQOO: 144Hz ఎల్టీపీవో డిస్ప్లేతో నేడు భారత్‌లో లాంచైన Neo 9 Pro
Next articleSamsung Galaxy F15 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.