
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి Neo 9 Pro భారత మార్కెట్ లోకి అడుగుపెట్టింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 50ఎంపి సోని ఐఎంఎక్స్920 కెమెరా, 144 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. సరే, ఓసారి iQOO Neo 9 Pro యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9 Pro ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత
- iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 23న ఐకూ స్టోర్ మరియు అమెజాన్ ద్వారా విక్రయానికి వస్తోంది.
- నేడు మధ్యాహ్నం 1 గంటల నుంచి iQOO Neo 9 Pro ని ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
- iQOO Neo 9 Pro 8జిబి + 128జిబి వేరియంట్ మార్చి 21 నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
- iQOO Neo 9 Pro 8జిబి + 128జిబి మోడల్ ధర రూ.35,999 గా ఉంది.
- iQOO Neo 9 Pro 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.37,999 గా ఉంది.
- iQOO Neo 9 Pro 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది.
- iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 256జిబి స్టోరేజీ వేరియంట్స్ పై ఐకూ రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.
- ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
- ఐకూ మరియు వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.4,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కి అర్హులు. ఇతరులకు రూ.2,000 బోనస్ లభిస్తుంది.
- బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్‌చేంజ్ బోనస్ రెండూ ఒకేసారి పొందడం వీలుకాదని పాఠకులు గమనించాలి.
iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1-144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్ (2800*1260 పిక్సెల్స్), 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉంటాయి. ఐకూ క్యూ1 సూపర్‌కంప్యూటింగ్ చిప్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 12జిబి వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది.
- కెమెరా: iQOO Neo 9 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: iQOO Neo 9 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, నావిక్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











