
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో F25 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో వచ్చింది. OPPO F25 Pro 5G లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఐపీ65 రేటింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
OPPO F25 Pro 5G ధర, లభ్యత
- OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఒప్పో స్టోర్ ద్వారా మార్చి 5 నుంచి ఓపెన్ సేల్ మొదలవుతుంది.
- OPPO F25 Pro 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
- OPPO F25 Pro 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.23,999 గా ఉంది.
- OPPO F25 Pro 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది.
- హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ని ఒప్పో ఆఫర్ చేస్తోంది.
- OPPO F25 Pro 5G డివైజ్ లావా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OPPO F25 Pro 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO F25 Pro 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్), 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, పాండా గ్లాస్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: OPPO F25 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- సాఫ్ట్వేర్: OPPO F25 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: OPPO F25 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.
- బ్యాటరీ: OPPO F25 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సెక్యూరిటీ: OPPO F25 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.
- కనెక్టివిటీ: OPPO F25 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: OPPO F25 Pro 5G డివైజ్ 161.6 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.54 మి.మీ మందం ఉంటుంది.











