భారత్ లో మళ్ళీ మొదలైన Nothing Phone (1) ప్రీ-ఆర్డర్ సేల్స్

హైలైట్స్:

  • జులై 18 నుంచి అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఫోన్ (1) స్టాక్స్
  • ప్రీ-ఆర్డర్ కొనుగోలుదారులు జులై 20 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు
  • జులై 21 రాత్రి 7 గంటల నుంచి నథింగ్ ఫోన్ (1) పబ్లిక్ సేల్ ప్రారంభం

ఇటీవలె నథింగ్ ఫోన్ (1) భారత్ లో లాంచ్ అయ్యింది. లాంచ్ అయిన వెంటనే, ప్రీ-ఆర్డర్ వినియోగదారులకు ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, కొన్ని గంటల్లోనే నథింగ్ ఫోన్ (1) స్టాక్ అయిపోయింది. దీంతో ఎంతోమంది ముందస్తు కొనుగోలుదారులు డివైజ్ ను బుక్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు నథింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను శర్మ, జులై 18 మధ్యాహ్నం 12 నుంచి సేల్ మళ్ళీ మొదలవుతుందని ప్రకటించారు.

మరో విషయం ఏంటంటే, సేల కాల వ్యవధిని కూడా జులై 19 మరియు జులై 20 అర్థరాత్రి వరకు పొడిగించారు. ఇక దీని తర్వాత, జులై 21 రాత్రి 7 గంటల నుంచి నథింగ్ ఫోన్ (1) (రివ్యూ) పబ్లిక్ సేల్ మొదలవుతుంది. మరి భారత్ లో మీరు నథింగ్ ఫోన్ (1) ని ఎక్కడ కొనవచ్చు. ధర, బ్యాంక్ ఆఫర్లు ఏంటో ఇక్కడ చూద్దాం.

Nothing Phone (1) ప్రీ-ఆర్డర్ సేల్, భారత్ లో ధర, ఆఫర్లు

నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ సేల్ జులై 18 మధ్యాహ్నం 12 నుంచి మళ్లీ మొదలైంది. జులై 20 వరకు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ డివైజ్ మూడు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది. 8జిబి+128జిబి మోడల్ ధర రూ.32,999. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.35,999. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.38,999.

ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద, నథింగ్ ఫోన్ (1) పై కంపెనీ రూ.1,000 డిస్కౌంట్ ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ యూజర్లు నథింగ్ ఫోన్ (1) కొనుగోలు పై రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక నథింగ్ ఫోన్ (1) పబ్లిక్ సేల్ జులై 21 రాత్రి 7 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మొదలవుతుంది.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, నథింగ్ ఓఎస్ కస్టమ్ స్కిన్, 50ఎంపి+50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) లో ఉన్నాయి.

  • Glyph Interface విశేషాలు

నథింగ్ కంపెనీ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1). గ్లైఫ్ ఇంటర్ ఫేస్ హైలైట్ పాయింట్ గా ఈ ఫోన్ రంగంలోకి దిగింది. మరి గ్లైఫ్ ఇంటర్ ఫేస్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఐదు లైటింగ్ స్ట్రిప్స్ ఉంటాయి. వీటిని 900 కి పైగా ఎల్ఈడీ లతో తయారు చేయబడినట్లు సమాచారం. ఛార్జింగ్, నోటిఫికేషన్స్, కాల్స్ కి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఈ ఎల్ఈడీ లైట్స్ అన్నీ కలిసికట్టుగా లేదా దేనికదే వివిధ కాంబినేషన్లలో వెలుగుతాయి. గ్లైఫ్ ఇంటర్ఫేస్ సెట్టింగ్స్ పేజీలో ఈ ఎల్ఈడీ లైటింగ్ స్ట్రిప్స్ ని మీకు కావాల్సిన విధంగా మార్చుకునే వీలుంది. బ్యాటరీ ఎంత వరకు ఛార్జ్ అయ్యిందన్న విషయంతో పాటు, వైర్లెస్ రివర్స్ చార్జింగ్ కు సంబంధించిన ఇండికేషన్లను ఈ గ్లైఫ్ ఎల్ఈడీ లు అందిస్తాయి. మరి ఈ సరికొత్త టెక్నాలజీని ప్రయత్నించాలనుకునే వారు ఈ ఫోన్ ని సొంతం చేసుకోవాల్సిందే. ఫ్లిప్ కార్ట్ ద్వారా నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ బుకింగ్ కి అందుబాటులో ఉంది.

Previous articleభారత్ లో లాంచ్ అయిన OPPO Reno 8, OPPO Reno 8 Pro
Next article5జీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న Redmi K50i
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.