Realme: 24GB ర్యామ్ పవర్‌తో భారత్ లో లాంచైన Realme 12+ 5G

Highlights

  • భారత్ లో లాంచైన Realme 12+ 5G
  • 12జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన ఫోన్
  • Realme 12+ 5G ప్రారంభ ధర రూ.20,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్ + 12జిబి వర్చువల్ ర్యామ్ (24జిబి ర్యామ్), మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Realme 12+ 5G డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G ధర

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.20,999 గా నిర్ణయించారు.

Realme 12+ 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.

Realme 12+ 5G డివైజ్ కొనుగోలుపై కంపెనీ రూ.3,998 విలువగల Realme Buds T300 ఇయర్‌బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది.

Realme 12+ 5G డివైజ్ కొనే హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ బ్యాంక్ యూజర్లకు రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. భారీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని గేమింగ్ కోసం అందించారు.
  • ఓఎస్: Realme 12+ 5G డివైజ్ 12జిబి ఫిజికల్ ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఇతర ఫీచర్లు: Realme 12+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.