
Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO X6 Neo పేరుతో వస్తోన్న ఈ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారైంది. పోకో ఇండియా అధినేత హిమాన్శు టాండన్ లాంచ్ ని స్వయంగా కన్ఫర్మ్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు, కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా పేర్కొన్నారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
POCO X6 Neo ఇండియా లాంచ్ ఖరారు
పోకో ఇండియా హెడ్ హిమాన్శు టాండన్ POCO X6 Neo లాంచ్ కన్ఫర్మ్ చేశారు. అలాగే నేడు లాంచైన Realme 12 5G పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నేటి రియల్మీ 12 5జీ లాంచ్ చూశాక, అందరూ నియో కోసం వేచి చూడాలని టాండన్ కోరారు.
POCO M6 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వచ్చిందని దీని ధర కేవలం రూ.10,000 అని ఆయన చెప్పారు.
మార్చి 11 మరియు మార్చి 15 మధ్య POCO X6 Neo లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
After seeing today's launch, everyone should REALly wait for the 'Neo' upgrade.
Red Flags: Dimensity 6100+, LCD at 17k? ??
Just an FYI, we use Dimensity 6100+ in #POCOM65G which is priced under 10k. #POCOX6Neo
— Himanshu Tandon (@Himanshu_POCO) March 6, 2024
POCO X6 Neo ఇండియా ధర (లీక్)
లీకైన రిపోర్ట్ ప్రకారం, POCO X6 Neo డివైజ్ భారత్ లో రూ.16,000 లోపు ధరతో లాంచ్ కానుందని సమాచారం. అంటే రూ.15,499 వద్ద ఫోన్ ధర ఉంటుందని అంచనా వేయవచ్చు. ఇది బేస్ వేరియంట్ ధర అయ్యే అవకాశం ఉంది. అధిక స్టోరేజీ మోడల్స్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
POCO X6 Neo స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: POCO X6 Neo స్మార్ట్ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1920పీడబ్ల్యూఎమ్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: POCO X6 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
- ర్యామ్, స్టోరేజీ: POCO X6 Neo లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభించే అవకాశం ఉంది.
- కెమెరా: POCO X6 Neo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి.
- బ్యాటరీ: POCO X6 Neo లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: POCO X6 Neo ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.











