Infinix: గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్‌పై లిస్టైన Note 40 Pro 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Note 40 Pro 5G
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న Infinix Note 40 Pro 5G

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Infinix త్వరలో Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ మలేషియో లాంచ్ తేదీ ఇప్పటికే ఖరారైంది. మార్చి 18న మలేషియాలో నోట్ 40 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Note 40 Pro 5G, Note 40 Pro+ 5G అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. లాంచ్‌కి ముందు, ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. MySmartPrice ఈ విషయాన్ని తన కథనం ద్వారా తెలిపింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Note 40 Pro 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6851 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Infinix Note 40 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్ సపోర్ట్ ఉంటాయని గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ ద్వారా తెలిసింది.

Infinix Note 40 Pro 5G డివైజ్ ని గమనిస్తే ముందువైపున కర్వ్డ్ ఎడ్జెస్ మరియు పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.

Infinix Note 40 Pro 5G లో పవర్ మరియు వాల్యూమ్ కీస్ ఫోన్ కి కుడివైపున ఉంటాయి.

Infinix Note 40 Pro 5G స్పెసిఫికేషన్స్

  • ప్రాసెసర్: Infinix Note 40 Pro 5G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 Pro 5G లో 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. అయితే ఈ ఫోన్ 70 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మరియు 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • కెమెరా: Infinix Note 40 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో వాడే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Previous articleiQOO: లాంచ్‌కి ముందు లీకైన iQOO Z9 5G ధర
Next articlePOCO: భారత్‌లో లాంచైన POCO M6 5G Airtel ఎక్స్‌క్లూజివ్ మోడల్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.