Samsung: డైమెన్సిటీ 6100+ చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన Galaxy M15 5G

Highlights

  • గ్లోబల్ గా లాంచైన Galaxy M15 5G
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్
  • 6000mAh బ్యాటరీ కెపాసిటీ

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా Galaxy M15 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇరాక్ తో పాటు లెవంట్ (సిరియా, లెబనాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, జోర్డాన్, సైప్రస్) దేశాల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి గెలాక్సీ ఎమ్15 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G కలర్ ఆప్షన్స్, ధర, సేల్ తేదీ

Samsung Galaxy M15 5G డివైజ్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఇరాక్ మరియు లెవంట్ రీజియన్స్ లో ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఇంకా డివైజ్ ధర మరియు సేల్ తేదీ వెల్లడి కాలేదు.

Samsung Galaxy M15 5G విక్రయ తేదీ, ధర తదితర వివరాలను త్వరలో కంపెనీ ప్రకటించనుంది.

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G డివైజ్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Samsung Galaxy M15 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Samsung Galaxy M15 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్ మరియు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • భద్రత: Samsung Galaxy M15 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.