
Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో Z9 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్ పవర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 256జిబి స్టోరేజీ, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి చక్కటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి iQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం పదండి.
iQOO Z9 5G టాప్-5 ఫీచర్లు
- రిఫ్రెష్ రేట్: iQOO Z9 5G లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల స్క్రీన్ అందించారు. 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ బ్రైట్నెస్ ఈ డిస్ప్లే లో ఉన్నాయి.
- ఎక్స్‌టెండెడ్ ర్యామ్: iQOO Z9 5G డివైజ్ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా యూజర్ కి అదనంగా ర్యామ్ పవర్ లభించనుది. 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో యూజర్ 16జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
- ఓఐఎస్: iQOO Z9 5G లో సోని ఐఎంఎక్స్882 సెన్సర్ కలిగిన 50ఎంపి ఓఐఎస్ కెమెరా ఉంది.
- ఆడియో: iQOO Z9 5G లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ అందించారు. దీని వల్లన యూజర్ కి మెరుగైన ఆడియో అనుభూతి లభించనుంది.
- టచ్ శాంప్లింగ్ రేట్: iQOO Z9 5G లో 1200 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్ అందించారు. ఇది గేమింగ్‌కి ఎంతగానో ఉపయోగపడనుంది.
iQOO Z9 5G లో ఇంకా ఐపీ54 రేటింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, వై-ఫై 6, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
iQOO Z9 5G ధర, కలర్ ఆప్షన్స్
iQOO Z9 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.
ఐసీఐసీఐ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
మార్చి 14 నుంచి అధికార వెబ్‌సైట్ మరియు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా iQOO Z9 5G సేల్ కి అందుబాటులో ఉంటుంది.
iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ బ్రష్డ్ గ్రీన్ మరియు గ్రాఫీన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
iQOO Z9 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: iQOO Z9 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి 610 జీపీయూ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. యూజర్ కి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై 6 ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: iQOO Z9 5G లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











