Realme Narzo 70 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు

Highlights

  • నేడు లాంచైన Realme Narzo 70 Pro 5G
  • డివైజ్ ప్రారంభ ధర రూ.19,999
  • కలర్స్: గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Narzo 70 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ సోని ఐఎంఎక్స్890 కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.21,999 గా పెట్టారు.

Realme Narzo 70 Pro 5G డివైజ్ బేస్ మోడల్ పై లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.1,000, టాప్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ అందిస్తున్నారు.

Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో ఉన్న టాప్ – 5 ఫీచర్లు ఏవో ఓసారి తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro 5G టాప్-5 ఫీచర్లు

  1. సెన్సర్: Realme Narzo 70 Pro 5G లో Sony IMX890 OIS మెయిన్ కెమెరా సెన్సర్ అందించారు. ఇది హైలైట్ ఫీచర్ గా చెప్పవచ్చు. కెమెరా లవర్స్ కి అందుబాటు ధరలో ఈ ఫోన్ మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
  2. ఎయిర్ జెశ్చర్: Realme Narzo 70 Pro 5G డివైజ్ ద్వారా ఎయిర్ జెశ్చర్ ఫీచర్ ని పరిచయం చేశారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ తెరను తాకకుండానే ఆపరేట్ చేయవచ్చు.
  3. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్: Realme Narzo 70 Pro 5G లో రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ ని కూడా అందించారు. దీని ద్వారా ఫోన్ డిస్ప్లే తడిగా ఉన్నప్పటికీ టచ్ పని చేస్తుంది. అంటే ఫోన్ ని చక్కగా ఆపరేట్ చేయవచ్చు.
  4. డిస్ప్లే: Realme Narzo 70 Pro 5G లో అమోలెడ్ డిస్ప్లేని ఆఫర్ చేశారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.
  5. చార్జింగ్: Realme Narzo 70 Pro 5G డివైజ్ 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

Realme Narzo 70 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo 70 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100% పీ3 కలర్ గేముత్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo 70 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 70 Pro 5G లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ సాయంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

బ్యాటరీ: Realme Narzo 70 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Realme Narzo 70 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Realme Narzo 70 Pro 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి వస్తాయి.

ఇతర ఫీచర్లు: Realme Narzo 70 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ ఉన్నాయి.