Realme GT Neo 6 SE లాంచ్ తేదీ ఖరారు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

Highlights

  • ఏప్రిల్ 11న Realme GT Neo 6 SE లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ కానుంది. Realme GT Neo 6 SE పేరుతో మార్కెట్ లోకి రానున్న ఈ డివైజ్ ఏప్రిల్ 11న చైనాలో లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించి చాలా లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటి ద్వారా స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ ద్వారా ఎన్నో విషయాలు ఖరారయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Realme GT Neo 6 SE లాంచ్ తేదీ ఖరారు

Realme GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని రియల్మీ సంస్థ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.

Realme GT Neo 6 SE డివైజ్ ఏప్రిల్ 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు చైనాలో లాంచ్ అవుతుంది.

కొత్త టీజర్ ద్వారా సిల్వర్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యింది. ఫోన్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

Realme GT Neo 6 SE ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT Neo 6 SE లో కాస్త కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. అలాగే 6.78-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్ (2780*1264 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT Neo 6 SE డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వస్తుందని సమాచారం. ఈ చిప్సెట్ ఇటీవలె లాంచ్ అయ్యింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 SE లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
  • కెమెరా: Realme GT Neo 6 SE లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని ఇప్పటికే ఖరారైంది. అయితే ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ఓఎస్: Realme GT Neo 6 SE డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
Previous articleRealme: త్వరలో రియల్మీ నుంచి రానున్న ‘P’ సిరీస్
Next articleRedmi: ఏప్రిల్ 10వ తేదీన చైనాలో లాంచ్ అవుతోన్న Turbo 3
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.