
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో నార్జో-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Narzo 70x 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ ఏప్రిల్ 24వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి వస్తోంది. అయితే లాంచ్‌కి ముందు అమెజాన్ పై Realme Narzo 70x 5G యొక్క మైక్రో-సైట్ ద్వారా డివైజ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Realme Narzo 70x 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme Narzo 70x 5G లో 120 హెర్ట్జ్ ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 70x 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 25 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
సెక్యూరిటీ: Realme Narzo 70x 5G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.
కెమెరా: Realme Narzo 70x 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఏయే సెన్సర్స్ ఉంటాయో ఇంకా తెలియదు. అయితే డ్యూయల్ కెమెరాలు సర్క్యులర్ మాడ్యూల్ లో ఉంటాయని తెలుస్తోంది.
Narzo 70 లైనప్ లో Realme Narzo 70x 5G డివైజ్ రెండోది. గత నెలలో Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్‌ని రియల్మీ లాంచ్ చేసింది. విషయం ఏంటంటే, బేస్ వేరియంట్ Narzo 70 ని మాత్రం ఇంకా లాంచ్ చేయలేదు.
Realme Narzo 70x 5G ధర
Realme Narzo 70x 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,000 లోపు ఉంటుందని మైక్రో-సైట్ ద్వారా తెలుస్తోంది. కచ్చితమైన ధర వివరాలు లాంచ్ తేదీ రోజున తెలుస్తాయి. రూ.12,000 బేస్ వేరియంట్ ధర అనుకోవచ్చు.
లీక్ ద్వారా Realme Narzo 70x 5G యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవెలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.
Realme Narzo 70x 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: Realme Narzo 70x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
ప్రాసెసర్: Realme Narzo 70x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.
ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 70x 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Realme Narzo 70x 5G లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Realme Narzo 70x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











