
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ OPPO నేడు చైనాలో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్ని లాంచ్ చేసింది. OPPO K12 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. OPPO K12 డివైజ్ భారత్ లో లాంచైన Nord CE 4 5G ని పోలి ఉంటుంది. ఒప్పో కే12 లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, మల్టీ-ఫంక్షనల్ ఎన్ఎఫ్సీ, ఐఆర్ బ్లాస్టర్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి OPPO K12 యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.
OPPO K12 ధర మరియు లభ్యత
OPPO K12 స్మార్ట్ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1899 యువాన్లు (సుమారు రూ.21,829) గా ఉంది.
12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2099 యువాన్లు (సుమారు రూ.24,620) గా ఉంది.
12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 2499 యువాన్లు (సుమారు రూ.28,726) గా ఉంది.
OPPO K12 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO K12 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: OPPO K12 లో స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: OPPO K12 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
బ్యాటరీ: OPPO K12 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: OPPO K12 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
ఓఎస్: OPPO K12 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కొన్నేళ్ళ పాటు యూజర్లకు లభించనున్నాయి. అయితే ఎన్నేళ్ళు అనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
కనెక్టివిటీ: OPPO K12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.











