Itel: మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన itel S24

Highlights

  • భారత్‌లో itel S24 లాంచ్
  • ఫోన్ ధర రూ.10,999
  • డివైజ్‌తో స్మార్ట్‌వాచ్ ఉచితం

చవకగా స్మార్ట్‌ఫోన్లను అందించే itel సంస్థ తాజాగా itel S24 అనే స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇటీవలె గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. గతేడాది లాంచైన ఐటెల్ ఎస్23 కి సక్సెసర్‌గా itel S24 మార్కెట్ లోకి వస్తోంది. itel S24 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్ వాడారు. సరే, ఓసారి ఐటెల్ ఎస్24 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

itel S24 ధర, లభ్యత

itel S24 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లభిస్తుంది. ఐటెల్ ఎస్24 స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.10,999 గా నిర్ణయించింది. నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

itel S24 కొనుగోలుపై ఐటెల్ సంస్థ, ICON స్మార్ట్‌వాచ్‌ని 500 కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది. దీంతో డివైజ్ ధర రూ.9,999 కి చేరనుంది. ఏప్రిల్ 23 నుంచి itel S24 స్మార్ట్‌ఫోన్ మరియు T11 Pro TWS అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి. వచ్చే వారం నుంచి రిటైల్ స్టోర్స్ లో కూడా కొనుగోలు చేయవచ్చు.

itel S24 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: itel S24 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, పంచ్ హోల్ నాచ్ ఉన్నాయి.

చిప్సెట్: itel S24 లో మీడియాటెక్ హీలియో జీ91 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: itel S24 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: itel S24 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఐటెల్ఓఎస్ 13.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: itel S24 డివైజ్ లో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 మెయిన్ కెమెరా, ఈఐఎస్ సపోర్ట్, క్యూవీజీఏ డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: itel S24 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: itel S24 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.