లీకైన Google Pixel 9 సిరీస్ ఫోన్ల లైవ్ ఇమేజెస్

Highlights

  • త్వరలో Google Pixel 9 సిరీస్ లాంచ్
  • లీక్ ద్వారా రివీలైన 3 మోడల్స్
  • టెన్సర్ జీ4 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Google నుంచి త్వరలో Pixel 9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో 4 మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా పిక్సెల్ 9 సిరీస్ లోని 3 స్మార్ట్‌ఫోన్ల యొక్క లైవ్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో డివైజెస్ డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఓసారి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల యొక్క డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Google Pixel 9 సిరీస్ లైవ్ ఇమేజెస్ (లీక్)

జర్మనీకి చెందిన వెబ్‌సైట్ Rozetked ద్వారా Google Pixel 9 సిరీస్ యొక్క లైవ్ ఇమేజెస్ రివీల్ అయ్యాయి.

లీక్ లో 3 మోడల్స్ కనిపిస్తున్నాయి. అయితే లాంచ్ సమయంలో ఈ సిరీస్ నుంచి 4 మోడల్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Pixel 9, Pixel 9 Pro, Pixel 9 XL మరియు Pixel 9 Pro XL ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం.

Google Pixel 9 మెటల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్ తో ఉన్నట్లు ఇమేజ్ ని గమనిస్తే తెలుస్తోంది.

Google Pixel 9 Pro గురించి మాట్లాడితే, ఈ డివైజ్ మ్యాట్ ఫినిష్ తో వస్తున్నట్లు సమాచారం.

రెండు ఫోన్ల యొక్క ఇమేజెస్‌ని గమనిస్తే, ప్రో వేరియంట్ లో 3 కెమెరాలు, స్టాండర్డ్ వేరియంట్ లో రెండు కెమెరాలు ఉన్నట్లు అర్థమవుతోంది.

లీక్ ద్వారా బయటకు వచ్చిన ఇమేజెస్‌ని పరిశీలిస్తే, డివైజెస్ ఫ్రంట్ లుక్ రివీల్ కాలేదని స్పష్టమవుతోంది. అయితే పిక్సెల్ 9 డిస్ప్లేలో పిక్సెల్ 9 ప్రో తో పోల్చితే, బెజెల్స్ మందంగా ఉంటాయని అంచనా వేయవచ్చు.

Previous articleVivo Y200 Pro: లీకైన వై200 ప్రో ధర, స్పెసిఫికేషన్స్
Next articleVivo: Dimensity 9300+ చిప్సెట్‌తో చైనాలో లాంచైన Vivo X100s, Vivo X100s Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.