
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6T పేరుతో వస్తోన్న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో మే 22న లాంచ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ వివరాలు ఖరారయ్యాయి. ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ మరియు ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్‌ని రియల్మీ కన్ఫర్మ్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.
Realme GT 6T బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్
Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ తో పాటు రియల్మీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
లిస్టింగ్ ప్రకారం, Realme GT 6T డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
రియల్మీ జీటీ 6టీ ఫోన్ కేవలం 10 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని రియల్మీ కంపెనీ చెబుతోంది.
Realme GT 6T ఫోన్ 2,750 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ ఆర్కిటెక్చర్ తో వస్తున్నట్లు సదరు కంపెనీ తెలిపింది.
Realme GT 6T స్పెసిఫికేషన్స్ (అంచనా మరియు ఖరారైనవి)
డిస్ప్లే: Realme GT 6T లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ హై బ్రైట్నెస్ ఉంటాయి.
ప్రాసెసర్: Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.
కెమెరా: Realme GT 6T లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Realme GT 6T లో ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.












