హైలైట్స్:
- నెట్టింట్లో ప్రత్యక్షమైన రెడ్ మీ కే60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్
- 2కే డిస్ప్లే, 50ఎంపి కెమెరా, మీడియాటెక్/క్వాల్కమ్ ప్రాసెసర్ తో రానున్న రెడ్ మీ కే60
- 2023 మొదట్లో చైనాలో లాంచ్ కానున్న రెడ్ మీ కే60 సిరీస్
రెడ్ మీ కే50 సిరీస్ లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, తదుపరి సిరీస్ కు సంబంధించిన వార్తలు ఆన్ లైన్లోకి రావడం మొదలైంది. మరోవైపు రెడ్ మీ కంపెనీ ఆగస్టులో రెడ్ కే50ఎస్ సిరీస్ ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈలోపు రెడ్ మీ కే60 సిరీస్ యొక్క టైమ్ లైన్ ఇదేనంటూ వార్త బయటకు వచ్చింది. తన వీబో పోస్ట్ లో నమ్మదగిన టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రెడ్ మీ కే60 సిరీస్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఫోన్ చైనాలో ఎప్పుడు లాంచ్ కానుందనే విషయాన్ని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. గతంలో డిజిటల్ చాట్ స్టేషన్ లాంచ్ చేసిన ఎన్నో లీక్స్ నిజమయ్యాయి. కానీ, రెడ్ మీ కే60 సిరీస్ కు సంబంధించిన లీక్ పై సందేహాలు నెలకొన్నాయి.
Redmi K60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, రెడ్ మీ కే60 సిరీస్ 2023 ప్రథమార్థంలో చైనాలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే, రెడ్ మీ కే60 సిరీస్ డ్యూయల్ ప్లాట్ఫామ్ స్ట్రేటజీతో వస్తోంది. అలాగే చిప్సెట్స్ కూడా టీఎస్ఎంసీ యొక్క 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారవ్వనున్నాయి. దీన్ని బట్టి మనం, మీడియాటెక్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్స్ ని కలిగి రెడ్ మీ కే60 సిరీస్ హ్యాండ్సెట్స్ ని చూడనున్నాం. ఇవి టీఎస్ఎంసీ యొక్క 4ఎన్ఎం ప్రాసెస్ ను వాడుకుంటున్నవి కాబట్టి, రెడ్ మీ కే60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్స్ ఉండే అవకాశముంది.
ఇక ఫోటోగ్రఫీ కోసం రెడ్ మీ కే60 సిరీస్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఉండనున్నట్లు సమాచారం. ఇక ఐటీహోమ్ కథనం ప్రకారం, ఈ 50ఎంపి సెన్సర్ సోనీ ఐఎంఎక్స్766 కి మోడిఫైడ్ వర్షన్ అని తెలుస్తోంది. రెడ్ మీ కే60 సిరీస్ లో 2కే డిస్ప్లే, ఫ్రంట్ కెమెరా కోసం సెంటర్ పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. ఇక భద్రత కొరకు ఈ ఫోన్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుందని అంచనా.
ఇప్పటి వరకు మనం రెడ్ మీ యొక్క రాబోయే కే60 సిరీస్ గురించి తెలుసుకున్నాం. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం తెలుసుకునే అవకాశముంది.అలాగే కంపెనీ నుంచి కూడా ఏదైనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈలోపు ఇటీవలే భారత్ లో లాంచ్ అయిన రెడ్ మీ కే50ఐ ఫోన్ కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.













