
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ itel భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. itel Color Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. చాలా తక్కువ ధరలో లాంచైన ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5జీ కనెక్టివిటీ, డైమెన్సిటీ 6080 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
itel Color Pro 5G ధర, లభ్యత
itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.9,999 గా నిర్ణయించారు. ఐటెల్ వెబ్‌సైట్, అమెజాన్, పార్ట్నర్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ కొనే వారికి రూ.3,000 విలువజేసే డఫ్‌ల్ బ్యాగ్‌ను ఉచితంగా అందజేస్తోంది. అలాగే ఏడాది కాలపరిమితితో వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్‌ను ఐటెల్ కంపెనీ ఆఫర్ చేస్తోంది.
itel Color Pro 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: itel Color Pro 5G లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్ ఉన్నాయి.
ప్రాసెసర్: itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి-జీ57 ఎంపీ2 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.
మెమొరీ: itel Color Pro 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. ఈ ఫోన్ లో 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు.
కెమెరా: itel Color Pro 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 0.08ఎంపి ఆగ్జిలరీ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: itel Color Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: itel Color Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వై-ఫై 5, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: itel Color Pro 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఫేస్ అన్‌లాక్, యూఎస్బీ-సీ పోర్ట్ ఉన్నాయి.











