iQOO Z9s సిరీస్ ఇండియా లాంచ్‌ను కన్ఫర్మ్ చేసిన ఐకూ

Highlights

  • త్వరలో iQOO Z9s సిరీస్ లాంచ్
  • ఆగస్టులో లాంచ్ కానున్న జీ9ఎస్
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ

iQOO Z9 సిరీస్ సక్సెస్ తర్వాత ఐకూ కంపెనీ iQOO Z9s సిరీస్‌ను భారత్‌కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఐకూ బ్రాండ్ iQOO Z9s సిరీస్ యొక్క ఇండియా లాంచ్‌ను కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వబోతున్నాయి. సరే, ఓసారి ఈ సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

iQOO Z9s సిరీస్ ఇండియా లాంచ్

iQOO Z9s సిరీస్ ఆగస్టు నెలలో భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. అయితే ఐకూ కంపెనీ ఈ సిరీస్ లో భాగంగా ఏయే ఫోన్లను లాంచ్ చేయనుందో ఇంకా తెలియజేయలేదు. అలాగే కచ్చితమైన లాంచ్ తేదీ కూడా ఇంకా వెల్లడికాలేదు. రానున్న రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9 Lite 5G లో 6.56-ఇంచ్ అల్ట్రా బ్రైట్ స్క్రీన్, 840 నిట్స్ బ్రైట్నెస్ మరియు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: iQOO Z9 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. అంటుటు సైట్ పై ఈ చిప్సెట్ 414,564 స్కోర్ నమోదు చేసింది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 Lite 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: iQOO Z9 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: iQOO Z9 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: iQOO Z9 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.