
స్మార్ట్‌ఫోన్ కొనేముందు మనం చూసే ప్రధాన స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ కూడా ఒకటి. చాలా మందికి బ్యాటరీ లైఫ్ అనేది ఎంతో ప్రధానమైన విషయం. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా ఫోన్ పని చేసేలా ఉంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి. మరి ఆ తరహా ఫోన్లను వెతికి పట్టుకోవడం కొంచెం కష్టమైన పనే. కానీ మీకోసం ఉత్తమ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్ల జాబితాను తీసుకొచ్చాం. అది కూడా రూ.20,000 లోపు బడ్జెట్ లో.. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందామా?
రూ.20,000 లోపు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లు
Realme 12
Realme 12 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే రోజంతా బ్యాకప్ అందిస్తుంది. పీసీమార్క్ టెస్ట్ లో ఈ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ 19 గంటలుగా నమోదైంది.
టెస్టింగ్ సందర్భంగా, బ్యాటరీ లైఫ్ 30 నిమిషాల పాటు యూట్యూబ్ వాడకంపై 4 శాతం ఖర్చైంది. బీజీఎంఐ గేమ్‌ను 30 నిమిషాల పాటు ఆడితే 8 శాతం బ్యాటరీ ఖర్చయింది. ఇక, 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో ఈ ఫోన్‌కి 65-70 నిమిషాల సమయం పట్టింది.
Realme 12 6జిబి/128జిబి మోడల్ ధర రూ.16,999 గా ఉంది. 8జిబి/128జిబి వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.
Lava Blaze Curve
Lava Blaze Curve స్మార్ట్‌ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల 39 నిమిషాల పాటు స్కోరును సాధించింది.
30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే, 5 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 మరియు బీజీఎంఐ గేమ్స్‌ను 30 నిమిషాల పాటు ఆడితే బ్యాటరీ 19 శాతం ఖర్చయ్యింది. 33 వాట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు గంట సమయం పట్టింది.
Lava Blaze Curve 8జిబి ర్యామ్/128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.17,999 గా ఉంది. 8జిబి ర్యామ్/256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది.
Realme Narzo 70 Pro
Realme Narzo 70 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సింగిల్ చార్జ్ పై ఈ బ్యాటరీ ఒక పూర్తి రోజు బ్యాకప్ అందిస్తుంది. ఈ ఫోన్ పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో 16 గంటల 24 నిమిషాల స్కోరును నమోదు చేసింది.
కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ గేమ్స్‌ను 30 నిమిషాల పాటు ఆడితే బ్యాటరీ 20 శాతం ఖర్చయ్యింది. యూట్యూబ్ లో 30 నిమిషాల పాటు వీడియోలు చూస్తే 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 67 వాట్ ఫాస్ట్ చార్జర్ తో 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 45 నిమిషాల సమయం పట్టింది.
Realme Narzo 70 Pro 8జిబి ర్యామ్/128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్/256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.21,999 గా నిర్ణయించారు.
Realme P1
Realme P1 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది సాధారణ వాడకంపై ఒకరోజు మొత్తం బ్యాకప్ ను అందిస్తుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఇది 16 గంటల 20 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.
మేం చేసిన టెస్టుల్లో, యూట్యూబ్ లో 30 నిమిషాలు వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 90 నిమిషాల పాటు గేమ్స్ ఆడితే 19 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. ఇక 45 వాట్ ఫాస్ట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 50 నిమిషాల సమయం పట్టింది.
Realme P1 6జిబి/128జిబి మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి/256జిబి మోడల్ ధర రూ.18,999 గా ఉంది.
Tecno POVA 6 Pro
Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది చాలా ఎక్కువ వాడకంపై ఒకరోజుకి మించి బ్యాకప్ ఇస్తుంది. అదే, సాధారణ వినియోగంపై రెండు రోజుల వరకు బ్యాకప్ లభిస్తుంది. అయితే, భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో 15 గంటల 56 నిమిషాల స్కోర్ మాత్రమే నమోదు చేసింది.
70 వాట్ ఫాస్ట్ చార్జర్ తో 0 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు గంట సమయం పట్టింది. ఇక టెస్టుల్లో, 30 నిమిషాల పాటు యూట్యూబ్ చూస్తే 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 90 నిమిషాల పాటు గేమ్స్ ఆడితే 16 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది.
Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి/256జిబి వేరియంట్ ధరను రూ.19,999 గా పెట్టారు. 12జిబి/256జిబి మోడల్ ధర రూ.21,999 గా ఉంది.
iQOO Z9
iQOO Z9 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ మీడియం నుంచి హెవీ యూసేజ్ పై డీసెంట్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో 15 గంటల 40 నిమిషాల స్కోరును నమోదు చేసింది.
44 వాట్ ఫాస్ట్ చార్జర్ తో 0 శాతం నుంచి 100 శాతం చార్జ్ చేసేందుకు 67 నిమిషాల సమయం పట్టింది. 90 నిమిషాల పాటు గేమ్స్ ఆడితే 18 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 5 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది.
iQOO Z9 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా పెట్టారు. 8జిబి+256జిబి మోడల్ ధరను రూ.21,999 గా నిర్ణయించారు.
Vivo T3
Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. సాధారణ వాడకంపై ఈ బ్యాటరీ ఒక పూర్తి రోజు బ్యాకప్ అందిస్తుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో 15 గంటల 16 నిమిషాలు స్కోర్ నమోదు చేసింది.
30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 90 నిమిషాల పాటు గేమ్స్ ఆడితే 17 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. 44 వాట్ ఫాస్ట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 1 గంట 10 నిమిషాల సమయం పట్టింది.
Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను రూ.21,999 గా పెట్టారు.








![Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-camera-phones-under-25k-oct-218x150.jpg?tr=q-70)
![Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-performing-phones-under-20k-sep-2024-218x150.jpg?tr=q-70)
![Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/09/Fastest-charging-phones-under-25k-218x150.jpg?tr=q-70)








