
Nokia బ్రాండ్ హోల్డర్, హ్యూమన్ మొబైల్ డివైజెస్ (HMD) సంస్థ త్వరలో గ్లోబల్ మార్కెట్ లో HMD Barbie Flip ఫోన్ను లాంచ్ చేయనుంది. ఆగస్తు 28వ తేదీన ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. అయితే ఇండియా లాంచ్ వివరాలు ఇంకా తెలియలేదు. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. దీంతో HMD Barbie Flip యొక్క లైవ్ ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
HMD Barbie Flip TENAA సర్టిఫికేషన్ వివరాలు
HMD Barbie Flip డివైజ్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై TA-1681 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫ్లిప్ ఫోన్ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, వొల్టీ, డ్యూయల్ సిమ్, ఫిజికల్ కీప్యాడ్, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తోంది.
టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ ద్వారా HMD Barbie Flip యొక్క లైవ్ ఇమేజెస్ కూడా రివీల్ అయ్యాయి. పింక్ కలర్ వేరియంట్ ఇమేజెస్ లో కనిపిస్తోంది. ఇమేజెస్ ద్వారా పోర్ట్ ప్లేస్మెంట్స్, డిజైన్ ఎలిమెంట్స్, కీప్యాడ్ కనిపిస్తున్నాయి. రియర్ ప్యానెల్ పై బార్బీ బ్రాండింగ్ ఉంది.
HMD Barbie Flip ఫోన్లో 2.8-ఇంచ్ టీఎఫ్టీ స్క్రీన్, 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1.77-ఇంచ్ టీఎఫ్టీ సెకండరీ డిస్ప్లే, 128*160 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
HMD Barbie Flip ఫోన్ లో సింగిల్-కోర్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.05 గిగాహెర్ట్జ్. 64ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 32జిబి వరకు పెంచుకునే వీలుంటుంది.
HMD Barbie Flip లో సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఈ ఫోన్ 108 మి.మీ పొడవు, 55 మి.మీ వెడల్పు, 18.9 మి.మీ మందం, 123 గ్రాముల బరువు ఉంటుంది. ఆగస్టు 28వ తేదీన ఈ ఫ్లిప్ ఫోన్ లాంచ్ అవుతుంది.












