Google Pixel 9 Pro Fold: భారత్‌లో లాంచైన గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్

Highlights

  • భారత్ లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన 4 స్మార్ట్‌ఫోన్లు
  • ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,72,999

ప్రముఖ టెక్ దిగ్గజం Google తాజాగా Pixel 9 సిరీస్ ను భారత్ తో పాటు, గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ మరియు పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అనే మోడల్స్ వచ్చాయి. పిక్సెల్ 9, 9 ప్రో, 9 ప్రో ఎక్స్ఎల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో Google Pixel 9 Pro Fold గురించి తెలుసుకుందాం. ఈ ఫోల్డబుల్ ఫోన్ ఎల్టీపీవో ఓఎల్‌ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Google Pixel 9 Pro Fold ధర

Google Pixel 9 Pro Fold ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.1,72,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. సేల్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వచ్చే నెలలో భారత్ లో సేల్స్ మొదలవుతాయని సమాచారం.

Google Pixel 9 Pro Fold ఫోల్డబుల్ ఫోన్ ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌ను శాసిస్తోన్న Samsung కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం Samsung Galaxy Z Fold 6 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.1,64,999 గా ఉంది. కానీ, 12జిబి+1టిబి మోడల్ ధర రూ.2,00,999 గా ఉంది. ఇది Google Pixel 9 Pro Fold కంటే ఎక్కువ. మరో విషయం ఏంటంటే, Google Pixel Fold గ్లోబల్ మార్కెట్ లో 1,799 యూఎస్ డాలర్లతో లాంచ్ అయ్యింది. మన కరెన్సీలో ఇది రూ.1,47,000.

Google Pixel 9 Pro Fold డిజైన్

Google Pixel 9 Pro Fold స్మార్ట్‌ఫోన్ అల్యూమినియమ్ అల్లాయ్ బాడీతో వచ్చింది. ఇది ఏరోస్పేస్ గ్రేడ్‌తో వచ్చినట్లు కంపెనీ చెబుతోంది.

మెటల్ ఫ్రేమ్ లో మరియు హింజ్ లో మల్టీ-అల్లాయ్ స్టీల్ ను వాడినట్లు కంపెనీ తెలిపింది. ఇంకా ఈ డివైజ్ లోని రెండు స్క్రీన్స్ కు కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందించారు.

Google Pixel 9 Pro Fold ఐపీఎక్స్8 వాటర్ రెసిస్టన్స్ తో వచ్చింది. ఇది కేవలం నీటి జల్లుల నుంచి మాత్రమే రక్షణ కల్పిస్తుంది.

మడిచినప్పుడు, ఈ ఫోన్ 155.2 మి.మీ పొడవు, 77.1 మి.మీ వెడల్పు, 10.5 మి.మీ మందం ఉంటుంది. తెరిచినప్పుడు, 155.2 మి.మీ పొడవు, 150.2 మి.మీ వెడల్పు, 5.1 మి.మీ మందం ఉంటుంది. Google Pixel 9 Pro Fold డివైజ్ 257 గ్రాముల బరువు ఉంటుంది.

Google Pixel 9 Pro Fold ఫోల్డబుల్ ఫోన్ ఒబ్సీడియన్ మరియు పార్సెలిన్ కలర్స్ లో లాంచ్ అయ్యింది.

Google Pixel 9 Pro Fold స్పెసిఫికేషన్స్

మెయిన్ డిస్ప్లే: Google Pixel 9 Pro Fold లో 8-ఇంచ్ ఫ్లెక్స్ డిస్ప్లే, 2076*2152 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 373పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉన్నాయి.

కవర్ డిస్ప్లే: Google Pixel 9 Pro Fold లో 6.3-ఇంచ్ కవర్ స్క్రీన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 1080*2424 పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 422 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Google Pixel 9 Pro Fold లో గూగుల్ టెన్సర్ జీ4 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ 8 కోర్స్ కలిగి ఉంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.10 గిగాహెర్ట్జ్. దీనికి తోడు భద్రత కోసం టైటాన్ ఎమ్2 సెక్యూరిటీ చిప్ అందించారు.

మెమొరీ: Google Pixel 9 Pro Fold డివైజ్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.

సాఫ్ట్‌వేర్: Google Pixel 9 Pro Fold డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 7 ఏళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ పొందుతుంది. అంటే ఆండ్రాయిడ్ 15 నుంచి ఆండ్రాయిడ్ 21 వరకు ఈ ఫోన్ అప్‌గ్రేడ్ అవుతుంది. ఇప్పటి వరకు ఇన్ని ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఆఫర్ చేసిన కంపెనీ మరొకటి లేదు. గూగుల్ ఇలా ఆఫర్ చేయడం మంచి విషయం.

బ్యాటరీ: Google Pixel 9 Pro Fold లో పవర్ బ్యాకప్ కోసం 4,650 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

రియర్ కెమెరా: Google Pixel 9 Pro Fold లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి క్వాడ్ పీడీ వైడ్ మెయిన్ కెమెరా, 10.5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10.8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. రియర్ కెమెరా సెటప్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 20ఎక్స్ సూపర్ రెజ్ జూమ్, ఓఐఎస్, ఈఐఎస్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Google Pixel 9 Pro Fold డివైజ్ లో రెండు సెల్ఫీ కెమెరాలను అందించారు. వీటిలో ఒకటి ఇన్నర్ డిస్ప్లే పై ఉంది. మరొకటి ఔటర్ స్క్రీన్ పై ఉంది. అంటే, ఫోన్‌ని మడిచినప్పుడు, తెరిచినప్పుడు.. రెండు సందర్భాల్లో కూడా సెల్ఫీస్, వీడియోస్ తీసుకోవచ్చు.

రెండు స్క్రీన్స్ పై 10ఎంపి డ్యూయల్ పీడీ ఫ్రంట్ కెమెరాలను అందించారు. ఈ రెండు సెన్సర్స్ తో 4కే 60ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

కనెక్టివిటీ: Google Pixel 9 Pro Fold లో 3 మైక్రోఫోన్లు ఉన్నాయి. అలాగే 5జీ, స్టీరియో స్పీకర్స్, గూగుల్ కాస్ట్, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ ఆంటెన్నా బ్లూటూత్ 5.3, 6గిగాహెర్ట్జ్ వై-ఫై 7 ఉన్నాయి.

Previous articleGoogle Pixel 9 Series: భారత్‌లో లాంచైన Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL
Next articleVivo Y300 Pro 5G: 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్న వివో వై300 ప్రో?
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.