
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO A60 5G పేరుతో ఈ ఫోన్ యూఏఈ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ భారత్‌లో లాంచైన OPPO A3 5G కి రీబ్రాండ్ వర్షన్. ఇకపోతే, OPPO A60 5G స్మార్ట్‌ఫోన్‌లో 5100 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి కెమెరా అందించారు. ఇప్పుడు, ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
OPPO A60 5G ధర
OPPO A60 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్‌లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో చూద్దాం.
OPPO A60 5G ధరను యూఏఈ లో AED 678 (సుమారు రూ.15,000) గా నిర్ణయించారు.
OPPO A60 5G స్మార్ట్‌ఫోన్ నెబులా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A60 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO A60 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
చిప్సెట్: OPPO A60 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: OPPO A60 5G డివైజ్ 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ, 6జిబి వరకు వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: OPPO A60 5G లో 50ఎంపి ఏఎఫ్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: OPPO A60 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
సాఫ్ట్‌వేర్: OPPO A60 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: OPPO A60 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: OPPO A60 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, మిలిటరీ గ్రేడ్ షాక్ మరియు లిక్విడ్ రెసిస్టన్స్ టెక్నాలజీ అందించారు.
బరువు, మందం: OPPO A60 5G డివైజ్ 187 గ్రాముల బరువు, 7.7 మి.మీ మందం ఉంటుంది.











