
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Turbo 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన భారత్ లో Realme Narzo 70 Turbo 5G లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ మోటార్‌స్పోర్ట్-ఇన్స్పైర్డ్ డిజైన్ తో వస్తోంది. లాంచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme Narzo 70 Turbo 5G లాంచ్ తేదీ, డిజైన్ వివరాలు
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో సెప్టెంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. లాంచ్ ఈవెంట్‌ను యూట్యూబ్ చానల్ లో లైవ్‌లో చూడవచ్చు.
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ 7.6 మి.మీ మందంతో చాలా సన్నగా ఉంటుంది. టీజర్ ఇమేజ్ ప్రకారం, ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై మధ్యలో పసుపు రంగులో గీతలు ఉన్నాయి. అలాగే స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. టాప్ లో స్పీకర్ మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

Realme Narzo 70 Turbo 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ RMX5003 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది.
ఈ ఫోన్ పర్పుల్, యెల్లో మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Realme Narzo 70 Turbo 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి వేరియంట్స్ లో రానుంది.
కెమెరా ఎఫ్‌వీ-5 ప్లాట్‌ఫామ్ పై Realme Narzo 70 Turbo 5G డివైజ్ సేమ్ మోడల్ నంబర్ RMX5003 తో లిస్ట్ అయ్యింది.
Realme Narzo 70 Turbo 5G లో 12.6ఎంపి ఈఐఎస్ కెమెరా, ఎఫ్/1.9 అపర్చర్ ఉంటాయని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ సెన్సర్ 4096*3072 రెజుల్యూషన్ గల ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. కంపెనీ ఈ డివైజ్‌ను 50ఎంపి ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేయవచ్చు.
ఫోన్ ముందువైపున, 4ఎంపి ఈఐఎస్ కెమెరా ( ఎఫ్/2.5 అపర్చర్) ఉంటుందని తెలుస్తోంది. ఈ సెన్సర్ 2304*1728 రెజుల్యూషన్ గల ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. ఈ కెమెరాను రియల్మీ 8ఎంపి హై మెగాపిక్సెల్ కౌంట్ కెమెరాగా మార్కెట్ చేసే అవకాశం ఉంది.











