
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A06 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ కస్టమర్ల కోసం ఈ ఫోన్ విడుదల చేశారు. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy A06 ధర, లభ్యత
Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.11,499 గా పెట్టారు.
Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది.
Samsung Galaxy A06 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A06 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy A06 లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A06 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Samsung Galaxy A06 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.
బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A06 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Samsung Galaxy A06 లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy A06 లో భద్రత కోసం శాంసంగ్ నాక్స్, సైడ్-మౌంటెగ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.











