Vivo T3 Ultra vs Vivo V40: రెండు ఫోన్లలో ఏది బెటర్?

    వివో టీ3 సిరీస్ లో లేటెస్ట్ గా లాంచైన ఫోన్ Vivo T3 Ultra. ఈ ఫోన్ రూ.31,999 ల ప్రారంభ ధరతో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. విషయమేంటంటే, వీ40 ప్రో డివైజ్‌లో కూడా ఇదే చిప్సెట్ వాడారు. మరోవైపు, Vivo V40 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి, రెండింట్లో ఏది బెటర్ అనే విషయాన్ని తెలుసుకుందాం.

    Vivo T3 Ultra vs Vivo V40: స్పెసిఫికేషన్స్

    స్పెసిఫికేషన్స్ వివో టీ3 అల్ట్రా వివో వీ40
    డిస్ప్లే 6.78-ఇంచ్ 1.2కే అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 453పీపీఐ, 1260*2800 రెజుల్యూషన్, షాట్ జెన్సేషన్ ఆల్ఫా 6.78-ఇంచ్ 1.2కే అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 453పీపీఐ, 1260*2800 రెజుల్యూషన్, షాట్ జెన్సేషన్ ఆల్ఫా
    చుట్టుకొలత 164.2 x 74.9 x 7.6 మి.మీ 164.2 x 75 x 7.6 మి.మీ
    బరువు 192 గ్రాములు 190 గ్రాములు
    సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్
    రియర్ కెమెరా 50ఎంపి ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ 50ఎంపి ఓఐఎస్, 50ఎంపి అల్ట్రావైడ్
    సెల్ఫీ కెమెరా 50ఎంపి ఫ్రంట్ కెమెరా 50ఎంపి ఫ్రంట్ కెమెరా
    వీడియో 4కే/60ఎఫ్‌పీఎస్ 4కే/30ఎఫ్‌పీఎస్
    చిప్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
    బ్యాటరీ, చార్జింగ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్
    ర్యామ్, స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ
    కలర్స్ లునార్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ టైటానియమ్ గ్రే, లోటస్ పర్పుల్, గంగెస్ బ్లూ

     

    Vivo T3 Ultra vs Vivo V40: ధర

    Vivo T3 Ultra Vivo V40
    8జిబి+128జిబి ధర రూ.31,999 8జిబి+128జిబి ధర రూ.34,999
    8జిబి+256జిబి ధర రూ.33,999 8జిబి+256జిబి ధర రూ.36,999
    12జిబి+512జిబి ధర రూ.35,999 12జిబి+512జిబి ధర రూ.41,999

     

    Vivo T3 Ultra vs Vivo V40: డిజైన్

    Vivo T3 Ultra మరియు Vivo V40 ఫోన్లు చూడటానికి ఒకే విధంగా కనిపిస్తాయి. రెండింట్లో ఏది ఏ ఫోన్ అని చెప్పడం కష్టమే. రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై పిల్-షేప్డ్ కెమెరా ఐల్యాండ్ ఇచ్చారు. ఇందులో రెండు కెమెరాలు ఉంటాయి. ఇంకా ఆరా ఫ్లాష్‌లైట్ కూడా ఉంటుంది.

    ఈ రెండు ఫోన్లు కూడా ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చాయి. వివో టీ3 ప్లేన్ ఫినిష్ తో రాగా, వివో వీ40 గంగేస్ బ్లూ ఎడిషన్ వేవ్-ప్యాటర్న్ తో ప్రీమియమ్ లుక్ కలిగి ఉంది.

    Vivo T3 Ultra vs Vivo V40: డిస్ప్లే

    వివో వీ40 మరియు వివో టీ3 అల్ట్రా ఫోన్లలో 1.2కే రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా షాట్ జెన్సేషన్ ఆల్ఫా డిస్ప్లే ప్రొటెక్షన్ కలిగి ఉన్నాయి. రెండు ఫోన్ల నుంచి ఒకే విధమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.

    Vivo T3 Ultra vs Vivo V40: పెర్ఫామెన్స్

    వివో టీ3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ అందించారు. మరోవైపు, వివో వీ40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఇచ్చారు. రెండింటిని చూస్తే డైమెన్సిటీ 9300+ యొక్క పెర్ఫామెన్స్ మెరుగ్గా ఉంటుంది. క్రింద బెంచ్‌మార్క్ స్కోర్స్ అందించాం. ఓసారి చూడండి.

    బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
    అంటుటు 15,24,110 8,10,635
    గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,811 1,165
    గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 5,299 3,216

     

    మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ యొక్క అంటుటు స్కోర్ 15,24,110 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1,811 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 5,299 పాయింట్లుగా ఉంది. మరోవైపు, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ యొక్క అంటుటు స్కోర్ 8,10,635 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1,165 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3216 పాయింట్లు స్కోర్ చేసింది.

    Vivo T3 Ultra vs Vivo V40: కెమెరాలు

    కెమెరా విభాగానికి వస్తే, వివో వీ40 జీస్ లెన్సెస్‌తో స్పష్టమైన విజేతగా నిలుస్తోంది. రెండు ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. కానీ, వీ40 లో జీస్ సెన్సర్ ఉండటం, ఇంకా 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. రెండు ఫోన్లలో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ప్రొవైడ్ చేశారు.

    వివో వీ40 కెమెరా పనితీరు చూసి మేం ఇంప్రెస్ అయ్యాం. వివో టీ3 అల్ట్రా యొక్క డీటెయిల్డ్ కెమెరా రివ్యూ ఇంకా తెలియాల్సి ఉంది.

    Vivo T3 Ultra vs Vivo V40: బ్యాటరీ, చార్జింగ్

    వివో టీ3 అల్ట్రా మరియు వివో వీ40 ఫోన్లలో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. టెస్టింగ్ సందర్భంగా, వివో వీ40 ఫోన్ లో హెవీగా వాడిన తర్వాత కాస్త బ్యాటరీ పవర్ మిగిలి ఉంది. మేం జరిపిన, పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో 13 గంటలు స్కోర్ చేసింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్ కి 35 నిమిషాల సమయం పట్టింది. ఇవే ఫలితాలను వివో టీ3 అల్ట్రా నుంచి ఆశించవచ్చు.

    Vivo T3 Ultra vs Vivo V40: సాఫ్ట్‌వేర్

    రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. టీ3 అల్ట్రాకి రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. మరోవైపు, వివో వీ40 కి 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. రెండు ఫోన్లు ఏఐ టూల్స్ తో వచ్చాయి.

    ఏది బెటర్?

    ప్రారంభ ధర పరంగా చూస్తే.. కొత్తగా రిలీజైన వివో టీ3 అల్ట్రా, వివో వీ40కి బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా చెప్పవచ్చు. దీంట్లో శక్తివంతమైన చిప్సెట్ ఉంది. అయితే, వివో వీ40 లో జీస్ లెన్సెస్ తో కూడిన బెటర్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా మరియు ప్రీమియమ్ డిజైన్ కావాలంటే, వివో వీ40 మీకు బెస్ట్ ఆప్షన్. లేదంటే వివో టీ3 అల్ట్రా ఎంచుకోండి.