Redmi Note 14 Series చైనా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల

Highlights

  • త్వరలో రెడ్మీ 14 సిరీస్ విడుదల
  • చైనా లాంచ్ ఖరారు
  • టీజర్ విడుదల

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో రెడ్మీ 14 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా కంపెనీ చైనా వెబ్‌సైట్ లో ఈ ఫోన్ల యొక్క టీజర్ లిస్ట్ అయ్యింది. ఈ సిరీస్ లో Redmi Note 14 5G, Redmi Note 14 Pro 5G మరియు Redmi Note 14 Pro Plus 5G అనే ఫోన్లు లాంచ్ కానున్నాయి. అయితే, కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. కానీ, వచ్చే వారం ఈ సిరీస్ లాంచ్ అవుతుందని సమాచారం. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 14 Series టీజర్

రెడ్మీ 14 సిరీస్ టీజర్ లో రెండు స్మార్ట్‌ఫోన్లు కనిపించాయి. అవి: రెడ్మీ నోట్ 14 ప్రో మరియు నోట్ 14 ప్రో ప్లస్.

ఈ రెండు ఫోన్లు కూడా బ్యాక్ ప్యానెల్ పై కర్వ్డ్ స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో ఉన్నాయి. ఫోన్ల యొక్క ప్యానెల్ కూడా కర్వ్డ్ గా ఉంది.

కెమెరా మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు కనిపిస్తోంది.

రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ కెమెరా మాడ్యూల్ లో లెన్స్‌లు లోపల ఉన్నాయి. మరోవైపు, ప్రో వేరియంట్ లో సెన్సర్స్ వేర్వేరుగా ఉన్నాయి.

యాంటీ-ఫాల్, వాటర్‌ప్రూఫ్ మరియు సర్వీస్ గ్యారంటీ వంటి వాటిపై కంపెనీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

రెడ్మీ 14 సిరీస్ ఫోన్లు ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నాయి.

ఒక మోడల్‌ని గ్రీన్ కలర్ లో, ఇంకొక దాన్ని గ్రే కలర్ లో టీజ్ చేశారు. అయితే వీటి ఫోన్లను కంపెనీ మెన్షన్ చేయలేదు. లాంచ్ టైమ్ లో ఈ విషయాలు తెలుస్తాయి.

Redmi Note 14 Series స్పెసిఫికేషన్స్

రెడ్మీ నోట్ 14 ప్రో+ గ్రీన్ కలర్ లో వస్తున్నట్లు కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఇది 60ఎంఎం ఎఫ్/2.2 మిడ్-ఫోకస్ లెన్స్ కలిగి ఉంది. ప్రో వేరియంట్ 50ఎంపి ఏఐ ఓఐఎస్ కెమెరాతో రానుంది. ఇప్పటివరకు ఇవే వివరాలు రివీల్ అయ్యాయి.

Redmi Note 14 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi Note 14 స్మార్ట్‌ఫోన్ ఈ లైనప్ లో అత్యంత చవకైన ఫోన్. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఫోన్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ ప్యానెల్, 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తోంది.

Redmi Note 14 Pro, 14 Pro Plus (అంచనా)

రెడ్మీ నోట్ 14 ప్రో, రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ డివైజెస్ లో కర్వ్డ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ఈ రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

ప్రో వేరియంట్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ప్రో ప్లస్ మోడల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్సెట్ ఉంటుంది.

లీక్స్ మరియు లిస్టింగ్స్ ప్రకారం, ఈ రెండు ఫోన్లు కూడా 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది.