
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా గ్లోబల్ మార్కెట్ లో సీ-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme C65s పేరుతో ఈ డివైజ్ వియత్నాం దేశంలో విడుదలైంది. ఈ ఫోన్ లో 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే, 16జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి రియల్మీ సీ65ఎస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme C65s ధర
Realme C65s స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను VND 42,90,000 (సుమారు రూ.14,500) గా పెట్టారు.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను VND 47,90,000 (సుమారు రూ.16,000) గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర VND 52,90,000 (సుమారు రూ.18,000) గా ఉంది.
Realme C65s స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme C65s లో 6.74-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 560 నిట్స్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme C65s లో ఎంట్రీ లెవెల్ యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ అందించారు.
ర్యామ్, స్టోరేజీ: Realme C65s డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Realme C65s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి.
బ్యాటరీ, చార్జింగ్: Realme C65s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
సాఫ్ట్వేర్: Realme C65s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Realme C65s లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై 5, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Realme C65s లో ఐపీ54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ రేటింగ్, ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ ఉన్నాయి. ఇంకా 4 ఏళ్ళ వరకు స్మూథ్ పెర్ఫామెన్స్‌ను కంపెనీ హామీ ఇస్తోంది.











