హైలైట్స్:
- భారత్ లో ఇప్పటికి రెండు సార్లు అమ్మకానికి వచ్చిన నథింగ్ ఫోన్ (1)
- రెండు సందర్భాల్లోనూ గంటల వ్యవధిలో అమ్ముడైన ఫోన్
- ముగిసిన స్మార్ట్ ఫోన్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్
మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన నథింగ్ కంపెనీ, తన తొలి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) యొక్క మూడవ సేల్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 5 న నథింగ్ ఫోన్ (1) సేల్ కి వస్తోంది. ఇది వరకు జులై 21, జులై 30 తేదీల్లో రెండు సార్లు ఈ ఫోన్ సేల్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సేల్ లో ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింత రూ.1000 డిస్కౌంట్ ని అందించింది. అయితే ఇప్పుడు అది ముగిసిపోయింది.
భారత్ లో Nothing Phone (1) ధర
ఆగస్టు 5 న నథింగ్ ఫోన్ (1) సేల్ స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్ ని ఆర్డర్ చేయవచ్చు. ఫోన్ ని కొనాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ సైట్ పై ఓ కన్నేసి ఉంచండి. సేల్ మొదలు కాగానే వెంటనే ఆర్డర్ పెట్టేయచ్చు. నథింగ్ ఫోన్ (1) యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.35,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.38,999.
Nothing Phone (1) స్పెసిఫికేషన్స్
నథింగ్ ఫోన్ (1) యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, అది గ్లైఫ్ ఇంటర్ఫేస్. అవును దీని కోసమే జనాలు ఎగబడి ఈ ఫోన్ ని కొంటున్నారు. ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ పై కనిపించే ఐదు ఎల్ఈడీ లైట్స్ ఈ మ్యాజిక్ కి కారణం. ఈ లైట్స్ ని కాల్స్, నోటిఫికేషన్స్ కోసం నచ్చిన ప్యాటెర్న్ లో కన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇది కచ్చితంగా ఫోన్ కి సరికొత్త సొబగులను తీసుకువస్తుంది. అందుకే ఈ ఆధునిక తరం డిజైన్ కి జనాలు ఫిదా అవుతున్నారు.
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, నథింగ్ కస్టమ్ స్కిన్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఆగస్టు 5 న నథింగ్ ఫోన్ (1) సేల్ స్టార్ట్ అవుతుండగా, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్ ని ఆర్డర్ చేయవచ్చు. ఫోన్ ని కొనాలనే ఆసక్తి ఉన్నవారు, ఫ్లిప్ కార్ట్ సైట్ పై ఓ కన్నేసి ఉంచండి. సేల్ మొదలు కాగానే వెంటనే ఆర్డర్ పెట్టేయచ్చు. నథింగ్ ఫోన్ (1) యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.35,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.38,999.
నథింగ్ ఫోన్ (1) లో డిస్ప్లే ఇష్యూస్ వచ్చినప్పటికీ, ఫోన్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గక పోవడం గమనార్హం. గ్లైఫ్ ఇంటర్ఫేస్ టెక్నాలజీకి నవతరం బాగా ఆకర్షితులవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఏదేమైనా, డిస్ప్లే తో పాటు ఇతర హార్డ్ వేర్ ఇష్యూస్ పై నథింగ్ కంపెనీ వెనువెంటనే స్పందించి యూజర్లకు పరిష్కారం చూపుతుండటం వల్లన నథింగ్ ఫోన్ (1) మార్కెట్ లో బలంగా నిలబడినట్లైంది.












