హైలైట్స్:
- ఆగస్టు 26 న లాంచ్ అవుతోన్న ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4జీ
- మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 108ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- డార్క్ బ్లూ, వైట్, గ్రే అనే మూడు రంగుల్లో లభ్యం కానున్న ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4జీ

ఆగస్టు 26 న ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4జీ భారత్ లో లాంచ్ అవుతోంది. ట్విట్టర్ లో సందరు బ్రాండ్ ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4జీ యొక్క టీజర్ ను షేర్ చేసింది. మీడియాటెక్ హీలియో జీ సిరీస్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ రానున్నట్లు ఇన్ఫినిక్స్ కన్ఫర్మ్ చేసింది. ఇక ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ లో ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4జీ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ మైక్రోసైట్ ద్వారా ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ ఏంటో తెలుస్తున్నాయి. గత నెలలో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ ఫోన్ కంటే ఇది తక్కువ స్థాయి ఫోన్. అయితే ఈ ఫోన్ ధరను ఇన్ఫినిక్స్ వెల్లడించలేదు. మరి త్వరలో భారత్ లో అడుగు పెట్టనున్న ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4జీ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Speed ahead with the fastest MediaTek Helio G series processor – first time in India! Coming with the Infinix NOTE 12 Pro. Stay tuned! pic.twitter.com/mTVisoj7y4
— Infinix India (@InfinixIndia) August 20, 2022
Infinix Note 12 Pro 4G డిజైన్
ఫ్లిప్ కార్ట్ లో షేర్ కాబడిన ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4జీ పోస్టర్స్ ని బట్టి ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. అవి: డార్క్ బ్లూ, వైట్, గ్రే. ఫోన్ బాక్స్ డిజైన్ ని కలిగి ఉంది. ఫ్లాట్ గా ఉన్న బ్యాక్ ప్యానెల్ పై ఎడమ వైపున ఇన్ఫినిక్స్ లోగో, రెక్టాంగ్యులర్ ఐలాండ్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఒక గుండ్రని మాడ్యూల్ లో ఉంది. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.
ఫోన్ బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. ఇక ఫోన్ కి ఎడమ వైపున సిమ్ ట్రే ఉంది.
Infinix Note 12 4G స్పెసిఫికేషన్స్
ఫోన్ పోస్టర్లు కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాయి. ఇన్ఫినిక్స్ నోట్ 12 4జీ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 108 ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 12 4జీ పూర్తి స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి రహస్యంగానే ఉన్నాయి. అతి త్వరలో ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Infinix Note 12 Pro 4G స్పెసిఫికేషన్స్
- మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్
- 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
- 108 ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
- 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
- 4జీ కనెక్టివిటీ












