హైలైట్స్:
- ఫ్లిప్ కార్ట్ లో రూ.50 వేల విలువజేసే ల్యాప్ టాప్ ఆర్డర్ పెట్టిన కస్టమర్
- ఆర్డర్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా డిటర్జెంట్ సబ్బులు ప్రత్యక్షం
- ఐఐఎం విద్యార్థి యశస్వీ శర్మకు ఎదురైన వింత అనుభవం
ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ హడావుడి కొనసాగుతోంది. అయితే షాపింగ్ సందడిలో వినియోగదారులకు షాకులు కూడా తగులుతున్నాయి. తాజాగా ఐఐఎం-అహ్మదాబాద్ విద్యార్థి యశస్వీ శర్మ ఫ్లిప్ కార్ట్ లో రూ.50,000 విలువ గల ల్యాప్ టాప్ ని తన తండ్రి కోసం ఆర్డర్ పెట్టాడు. అయితే పార్సెల్ బాక్స్ ఓపెన్ చేసిన వారికి గట్టి షాక్ తగిలింది. ల్యాప్ టాప్ ఉంటుందని భావిస్తే, బాక్స్ లో బట్టలు ఉతుక్కునే సబ్బులు కనిపించాయి.
తన తప్పుని ఒప్పుకోని Flipkart
Years ago I used to hear of snapdeal delivering stones in place of iPhone. Today @Flipkart delivered laundry soap in place of a laptop.
Flipkart assured order. From one of their biggest sellers, RetailNet.
Can never trust this website again. @flipkartsupport pic.twitter.com/VmVXG1tU3S
— Yashaswi Sharma (@yshswi) September 22, 2022
బాక్సులో సబ్బుల్ని వచ్చాయని ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ కి తెలపగా, తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని కస్టమర్ కేర్ సేవా ప్రతినిధి తెలిపినట్లు బాధితుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మరొక విషయం ఏంటంటే, ఆ ప్రోడక్ట్ కి రిటర్న్ పాలసీ లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక సోషల్ మీడియా ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నాడు సదరు వినియోగదారుడు.
బాక్స్ తెరిచి అందులో ఆర్డర్ చేసిన వస్తువు ఉంటేనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ కి ఓటీపీ చెప్పాలనే నిబంధన తన తండ్రికి తెలియకపోవడంతో పార్సెల్ ని అలాగే తీసుకున్నారని యశస్వీ తెలిపాడు. అయితే ఘటన నిజమేనని నిరూపించేందుకు తన వద్ద సీసీటీవీ రికార్డింగ్స్ ఉన్నాయని యశస్వీ చెప్పాడు. అయితే పార్సెల్ ఓపెన్ చేశాకే ఓటీపీ పంపాలని లేదంటే తాము చేసేదేమీ లేదని ఫ్లిప్ కార్ట్ చేతులెత్తేసిందని సదరు కస్టమర్ తెలిపాడు.
ఫ్లిప్ కార్ట్ అష్యూర్డ్ నుంచి పార్సెల్ వస్తుండటంతో తన తండ్రి నేరుగా బాక్స్ ని తెరచి చూశారని యశస్వీ అన్నాడు. అలాగే డెలివరీ ఎగ్జిక్యూటివ్ కూడా ఓటీపీ అడిగే ముందు బాక్స్ కాన్సెప్ట్ గురించి తన తండ్రికి ముందుగా చెప్పలేదని యశస్వీ చెప్పుకొచ్చాడు.
ఎట్టకేలకు స్టేట్మెంట్ తో వచ్చిన Flipkart
ఘటన తమ దృష్టికి వచ్చిన వెంటనే, కస్టమర్ కేర్ టీమ్ బాధిత కస్టమర్ కి మనీ రిఫండ్ ప్రాసెస్ ను మొదలుపెట్టిందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 3 నుంచి 4 రోజుల్లో కస్టమర్ కి డబ్బులు రిటర్న్ అవుతాయని చెప్పింది. అలాగే తప్పు ఎక్కడ జరిగిందో విచారణ చేసి, వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
ఓపెన్ బాక్స్ డెలివరీ ప్రాసెస్ లో భాగంగా, డెలివరీ పార్ట్నర్ పార్సెల్ ని కస్టమర్ ముందు తెరుస్తాడని, అప్పుడు కస్టమర్లు తాము ఆర్డర్ పెట్టిన వస్తువు ఉందో లేదో సరి చూసుకోవాలని అప్పుడే డెలివరీ ఎగ్జిక్యూటివ్ తో ఓటీపీ షేర్ చేయాలని ఫ్లిప్ కార్ట్ చెప్పింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












