హైలైట్స్:
- లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ఫోన్ల ధరలు
- Xiaomi 12T ధర 580 యూరోలు (దాదాపు రూ.46,300), Xiaomi 12T Pro ధర 770 యూరోలు (దాదాపు రూ.61,400)
- అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, Xiaomi 12T Pro

Xiaomi 12T సిరీస్ అక్టోబర్ 4 న గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. భారత్ లో కూడా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో Xiaomi 12T, Xiaomi 12T Pro మోడల్స్ ఉన్నాయి. షావోమీ 12టీ ప్రో 200ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తోంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా తర్వాత 200ఎంపి కెమెరాతో వస్తున్న రెండో మోడల్ ఇదే కానుంది. ఇప్పుడు లాంచ్ అనౌన్స్మెంట్ కి ముందు, Xiaomi 12T సిరీస్ యొక్క ధరలు రివీల్ అయ్యాయి. వీటిని టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ రివీల్ చేశాడు.
Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు (లీక్డ్)
Xiaomi 12T సిరీస్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి. 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 580 యూరోలు (దాదాపు రూ.46,300), 256జిబి స్టోరేజీ యూనిట్ ధర 630 యూరోలు (దాదాపు రూ.50,300).
ఇప్పుడు Xiaomi 12T Pro ధర ఎలా ఉందో చూద్దాం. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 770 యూరోలు (దాదాపు రూ.61,400) కాగా, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 800 యూరోలు (దాదాపు రూ.63,800). ఈ రెండు ఫోన్లు లునార్ సిల్వర్, బ్లూ, బ్లాక్/గ్రే కలర్ ఆప్షన్స్ లో లభించనున్నాయి.
Xiaomi 12T, Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 12T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 20ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ ఉన్నాయి.
Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ని అందించారు. ఈ డిస్ప్లే 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్లో క్వాల్కమ్ కంపెనీ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ని వాడారు. 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఇందులో అందించారు. ఇకపోతే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. ఈ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. షావోమీ 12టీ ప్రో లో 200ఎంపి భారీ మెయిన్ సెన్సర్ అందించారు. ఈ ఫోన్ కి ఈ కెమెరానే హైలైట్ పాయింట్ అని చెప్పాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.











