నవంబర్ లో లాంచ్ కానున్న Vivo V25 4G స్మార్ట్ ఫోన్

హైలైట్స్

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V25 4G
  • నవంబర్ నెలలో Vivo V25 4G లాంచ్ అవుతుందని అంచనా
  • Vivo V25e మాదిరి ఫీచర్లను Vivo V25 4G కలిగి ఉంటుందని సమాచారం

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ వివో త్వరలో Vivo V25 అనే 4జీ డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Pricebaba కథనం ప్రకారం, Vivo V25 4G స్మార్ట్ ఫోన్ నవంబర్ మధ్యలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే Vivo V25 4G యొక్క కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా రివీల్ కాలేదు. కానీ ఈలోపు పలు వెబ్ సైట్స్ లో వస్తున్న కథనాల ఆధారంగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ పై ఓ అవగాహన వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.

Vivo V25 4G యొక్క స్పెసిఫికేషన్స్ Vivo V25e మాదిరే ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో Vivo V25e గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయింది. Vivo V25e మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Vivo V25e స్పెసిఫికేషన్స్

Vivo V25e లో 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి. ఈ ఫోన్ 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంది.

Vivo V25e స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇకపోతే ఈ ఫోన్ 159.20 మిల్లీ మీటర్ల పొడవు, 74.20 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.79 మిల్లీ మీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo V25e లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్ సపోర్ట్ తో కూడిన 64ఎంపి ప్రైమరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో ముందువైపున 32ఎంపి కెమెరా ఉంది.

Vivo V25 4జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ, ధర తదితర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleచౌకైన Electric Scooter ని లాంచ్ చేసిన Ola
Next articleలీకైన Realme 10 రెండర్స్, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.