హైలైట్స్
- నేడు చైనాలో లాంచ్ అయిన Realme 10 Pro సిరీస్
- లైనప్ లో వచ్చిన ఫోన్లు: Realme 10 Pro మరియు Realme 10 Pro+
- 108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో లాంచ్ అయిన Realme 10 Pro+

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Realme నేడు చైనా మార్కెట్ లో Realme 10 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ వరుసలో Realme 10 Pro, Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్ తో Realme 10 Pro+ లాంచ్ అయ్యింది. Realme 10 Pro+ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్
Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, 5412*1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో వచ్చింది. అమోలెడ్ ప్యానెల్ తో ఈ ఫోన్ డిస్ప్లే తయారైంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 1.07 బిలియన్ కలర్ సపోర్ట్, 100 శాతం కలర్ గేముత్ డీసీఐ-పీ3, 800 నిట్స్ బ్రైట్నెస్, 5000000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్స్ Realme 10 Pro+ డిస్ప్లే లో ఉన్నాయి.

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన 64బిట్ ఆక్టాకోర్ చిప్. 2.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ ప్రాసెసర్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ68 జీపీయూ ని వాడారు.
Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్లలో మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కలిగి ఉంది. దీంతో 12జిబి ర్యామ్ మోడల్ 20జిబి ర్యామ్ తో పెర్ఫామ్ చేయగలదు.
Realme 10 Pro+ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
Realme 10 Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 17 నిమిషాల్లో ఈ మొబైల్ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
Realme 10 Pro+ ధర
Realme 10 Pro+ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1699 యువాన్లు (సుమారు రూ.19,400) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1999 యువాన్లు (సుమారు రూ.22,800) గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర 2299 యువాన్లు (సుమారు రూ.26,200) గా ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












